11న లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌ మిధున్‌రెడ్డి జన్మదిన వేడుకలు

0 10,138

– వేడుకలకు ఏర్పాట్లలో అభిమానులు

 

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

రాజంపేట ఎంపి, లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులతో కలసి ఈనెల 11న ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. పుంగనూరు మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. అలాగే పట్టణంలో రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్దీన్ షరీఫ్ , చైర్మన్‌ సిఆర్‌.లలిత, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాతో పాటు మిధున్‌రెడ్డి యువసేన నేతలు రాజేష్‌, సురేష్‌, బండకుమార్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే మదనపల్లె నియోజకవర్గం సిటిఎం క్రాస్‌లో సర్పంచ్‌ బండ్లపల్లె ఈశ్వరమ్మ , బండ్లపల్లె వెంకట్రమణ ఆధ్వర్యంలో 1000 కిలోల స్వీట్‌ప్యాకెట్లు ఇంటింటా పంపిణీ చేయనున్నారు. అలాగే పెద్దిరెడ్డి కుటుంబ అభిమానులు జన్మదిన వేడుకలు అన్ని ప్రాంతాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

   

వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్న తెలుగుముచ్చట్లు

Tags; 11th is the birthday of Lok Sabha Panel Speaker Midhunreddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page