పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డి ఈ కార్యాలయం ముట్టడి -సీపీఐ

0 9,692

డోన్ ముచ్చట్లు:

 

రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీలు ట్రూ ఆఫ్ చార్జీల పేరిట  అదనపు భారాలు వేయడాన్ని నిరసిస్తూ సిపి ఐ  ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి పిలుపుమేరకు డోన్  విద్యుత్ కార్యాలయం ఎదుట సిపిఐ  ఆధ్వర్యంలో ముట్టడి ధర్నా నిర్వహించి అనంతరం విద్యుత్ అధికారికి వినతి పత్రము ఇవ్వడం జరిగింది. అంతరం జరిగిన సభకు పట్టణ సహాయ కార్యదర్శి కె ప్రభాకర్ అధ్యక్షత వహించారు ,సీపీఐ డోన్ నియోజకవర్గ కార్యదర్శి ఎన్.రంగ నాయుడు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సుంకయ్య, కె.రాధాకృష్ణ ,ఏపిజియస్ జిల్లా కార్యదర్శి. మోట.రాముడు, ఖలీల్ భాషా ,బొంతిరాళ్ల గ్రామ సర్పంచి రవి మోహన్, ఏ ఐ వై యఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి.పులి శేఖర్,వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి. నారాయణ ఏఐటీయూసీ అధ్యక్ష,కార్యదర్శి. అబ్బాస్, పుల్లయ్య, రైతు సంఘము గౌరవఅధ్యక్షుడు ,ఆర్.బి.చిన్న రంగన్నమాట్లాడుతూ ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో విద్యుత్ సంస్థల ఖర్చులను  వినియోగదారులు చెల్లించాలని విపరీతంగా భారం  మోపి  పెంచిన విద్యుత్ చార్జీలను  రద్దు చేయాలని.వారు డిమెండ్ చేశారు,

 

 

 

 

- Advertisement -

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు తలొగ్గి విద్యుత్ ట్రూ అప్ చార్జెస్ పేరుతో ప్రజల పైన భారం మోపుతోంది ఇది చాలా దుర్మార్గం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు  మాట తప్పం మడమ తిప్పం అని పదే పదే చెప్పి  మా ప్రభుత్వం వస్తే ఐదు సంవత్సరాల వరకు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి గారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త మెలికలు పెడుతూ ప్రజలపై  ఆర్థిక భారం మోపడం దుర్మార్గమని అన్నారు కరెంటు చార్జీలు తగ్గించకుంటే పోతే గతంలో చంద్రబాబు నాయుడు కి పట్టిన గతే సి యం జగన్ మోహన్ రెడ్డి  పడుతుందని హెచ్చరించారు. వెంటనే పెరిగిన చార్జీలు ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వైయస్సార్ నగర్ వెంకటేశ్వర్లు మధు కలచట్ల చంద్రశేఖర్ ,కె.సుంకన్న.కొండయ్య,లక్ష్మీదేవి,  తది తరులు పాల్గొన్నారు.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; D this office siege -CPI to reduce inflated electricity charges

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page