దూరాన్ని జయించిన అభిమానం….

0 8,761

ముంబాయి   ముచ్చట్లు:
హైదరాబాద్ నుండి ముంబయి కి కాలినడకన  వెళ్లి సినీ నటుడు సోనూసూద్ ని కలిసిన సూర్యపేట జిల్లా,   కొమరబండ, యువకుడు దేవ ఇంద్ర కుమార్   మరోసారి అభిమానాన్ని చాటుకున్నాడు. సోను సూద్ పై రాసిన పాటను సోను సూద్ లో  విడుదల చేయించాడు.అభిమాన నటుడిని కలవాలనే ఆకాంక్ష పట్టుదల  అతన్ని వందలాది కిలోమీటర్ల దూరాన్ని  దగ్గర చేశాయి. కరోనా కాలంలో కష్టాల్లో ఉన్న వేలాది మందికి సహాయం చేసి ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు సాధించిన బాలీవుడ్ సినీ నటుడు సోను సూద్ ను  కలవాలని కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ కు చెందిన యువకుడు దేవపంగు ఇంద్ర కుమార్  హైదరాబాద్ నుండి ముంబై కి కాలినడకన పయనమయ్యాడు. వందలాది కిలోమీటర్ల దూరాన్ని సినీనటుడు పై ఉన్న అభిమానం  అతని విజేతగా నిలిపింది. ఇంద్ర కుమార్ ముంబైలో సోనూసూద్ ని కలిశాడు. ఇదే సందర్భంలో తాను రాసిన పాటలు సోను సూద్ ద్వారా విడుదల చేయించి  తనకున్న అపార అభిమానాన్ని ప్రేమను చాటుకున్నాడు. తనపై ఉన్న అభిమానంతో వందలాది కిలోమీటర్లు కాలినడకన వచ్చిన గాయకుడు ఇంద్ర కుమార్ సోను సూద్ అభినందించారు. కాగా కొమరబండ నుండి ఓ సామాన్య యువకుడు సాహసం చేసి కాలినడకన ముంబై వెళ్లి సోనూసూద్ ని కలిసి అభినందనలు పొందడం పట్ల కొమరబండ వాసులు  ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తూ అభినందించారు.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

- Advertisement -

Tags:Favorite to conquer the distance ….

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page