కేరళలో భారీగా కేసులు..

0 7,547

తిరువనంతపురం ముచ్చట్లు:

కరోనా వైరస్‌ అన్ని రాష్ట్రాల్లో అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ కేరళలో మాత్రం విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న 70 శాతం కేసులు ఇక్కడి నుంచే వస్తున్నాయి.కేర‌ళ‌లో వైరస్ వ్యాప్తి అంత‌కంత‌కు పెరిగిపోతోంది. గ‌త మూడు రోజుల నుంచి వ‌రుస‌గా ఐదేసీ వేల చొప్పున కొత్త కేసులు పెరుగుతూ వ‌చ్చాయి. అయితే, గడిచిన 24గంటల్లో నమోదైన కేసులు మరింత కలవరానికి గురిచేస్తో్ంది. ఇవాళ కొత్తగా 30,196 మందికి క‌రోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడిచిన 24గంటల్లో మ‌రో 27,579 మంది క‌రోనా బాధితులు వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. క‌రోనా మ‌ర‌ణాలు కూడా ఇవాళ భారీగానే పెరిగాయి. కొత్తగా 181 మంది క‌రోనా బాధితులు ప్రాణాలను కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 22,001 కు పెరిగింది. పరీక్ష సానుకూలత రేటు 17.63 శాతంగా నమోదైంది.జిల్లాల వారీగా పాజిటివ్ కేసుల గణాంకాలు పరిశీలిస్తే.. త్రిస్సూర్ – 3832, ఎర్నాకులం – 3611, కోజికోడ్ – 3058, తిరువనంతపురం – 2900, కొల్లాం – 2717, మలప్పురం – 2580, పాలక్కాడ్ – 2288, కొట్టాయం – 2214, అలప్పుజ – 1645, కన్నూర్ – 1433, ఇడుక్కి – 1333, పతనంతిట్ట – 1181, వయనాడ్ – 894, మరియు కాసరగోడ్ – 510 కేసులు నమోదయ్యాయి. కాగా, ప్రస్తుతం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 2,39,480 యాక్టివ్ కేసులు ఉన్నాయి.కేరళలో కరోనా మహామ్మరి విజృంభణతో సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యయి. తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో ఎమర్జెన్సీ హెల్త్‌ క్యాంపులు ఏర్పటు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కన్యాకుమారి , కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలకు కేరళ నుంచి వస్తున్న వాళ్లకు కచ్చితంగా వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు జిల్లాల్లో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. వ్యాక్సిన్‌ రెండు డోస్‌లు పూర్తి చేసుకున్న వాళ్లకు తమిళనాడు లోకి అనుమతిస్తున్నారు.సరిహద్దు జిల్లాల్లో 30 హెల్త్‌క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. వైరస్‌ లక్షణాలు ఉన్న వాళ్లను గుర్తించి చికిత్సకు తగిన ఏర్పాట్లు చేశారు.కేరళలో కేసులు విజృంభిస్తున్నాయి. అక్కడికక్కడే కంట్రోల్ చెయ్యకపోతే దేశమంతా థర్డ్‌ వేవ్ వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో కేరళ సీఎం పినరయి ప్రభుత్వానికి కేంద్రం పలు సూచనలు చేసింది. ‘వ్యూహాత్మక లాక్‌డౌన్‌’ అవసరమని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఇళ్లల్లో చికిత్స పొందుతున్నవారు కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదని.. వారిపై దృష్టి వహించాలంది కేంద్రం. కరోనా కేసులు తగ్గకపోవడానికి ఇదే మెయిన్‌ రీజన్‌ అని వైద్యారోగ్యశాఖ అధికారులంటున్నారు. మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేయాలని, కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని ఆరోగ్య శాఖ సూచించింది.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Heavy cases in Kerala ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page