భర్తనుకొట్టి.. భార్యను పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం!

0 9,019

గుంటూరు ముచ్చట్లు:

 

ఏపీలో మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.  గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో బుధవారం రాత్రి మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. భర్తనుకొట్టి.. భార్యను పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరు నగరంలో ఓ వివాహానికి హాజరై బైక్పై వస్తుండగా మేడికొండూరు అడ్డరోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  బైక్పై వస్తున్న దంపతులను కొందరు దుండగులు అడ్డగించి భర్తపై దాడి చేశారు.   అనంతరం భార్యను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.   దీనిపై బాధితులు అర్ధరాత్రి సత్తెనపల్లి పోలీస్స్టేషన్కు వెళ్లగా.. ఫిర్యాదు తీసుకునేందుకు అక్కడి పోలీసులు నిరాకరించారు.  ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్ ఎస్పీ పరిధిలోకి వస్తుందని.. తమ పోలీస్స్టేషన్ గుంటూరు రూరల్ పరిధిలో ఉంటుందని తెలిపారు.   దీంతో బాధితులు వెనుదిరిగారు.   ఘటన ఎక్కడ జరిగినా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును సంబంధిత పోలీస్స్టేషన్కు బదిలీ చేయాలంటూ ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ సత్తెనపల్లి పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: Husband beaten .. wife locked in fields and gang raped!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page