పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను మాత్రమే పూజించాలి-జిల్లా కలెక్టర్ జి.రవి

0 9,266

జగిత్యాల  ముచ్చట్లు:

 

పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలతో మాత్రమే పూజించాలని జిల్లా కలెక్టర్  జి.రవి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం జిల్లాకలెక్టర్ స్థానిక  ఐ.ఎం.ఏ. హల్ ఆవరణలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారి ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేశారు. పర్యావరణ సంరక్షణ కోసం జిల్లాలో  మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఆది దేవుడైన వినాయకుడిని మట్టితో తయారు చేసి పూజించటం ద్వారా సత్ఫలితాలు లభిస్తాయని, మన ఆకాంక్షలు నెరవేరుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. మట్టి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణ సంరక్షణ జరుగుతుందని, మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని  ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుత కరోనా వైరస్ మూడవ దశ వ్యాప్తి అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు పాటిస్తూ వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, బయట మాస్కులు ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలందరికీ  కలెక్టర్  వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్న తెలుగుముచ్చట్లు

Tags: Only eco-friendly earthen Ganapati idols should be worshiped – District Collector G. Ravi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page