పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

0 9,742

గాజువాక ముచ్చట్లు:

 

గర్భిణులు, బాలింతలు,చిన్నారులు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని 65 వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు అన్నారు.గురువారం పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమం వార్డులోని సంజీవిగిరి కోలనీ అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ గాజువాక సెక్టార్ ఆధ్వర్యంలో జరిగింది.ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు పోషకాహారం తీసుకోవడం ద్వారా పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని అన్నారు.వైద్య సిబ్బంది,ఆరోగ్య కార్యకర్తల సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఐసీడీఎస్ ప్రాజెక్టు ఏసీడీపీఓ ప్రభావతి,సూపర్వైజర్ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ పోషకాహారం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు.ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రాసన చేశారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మద్దాల అప్పారావు,రవివర్మ,నాగిశెట్టి శ్రీనివాస్,ఇరోతి గణేష్,మంగునాయుడు,లోకనాధం,దేముడు,జుత్తు లక్ష్మీ,ఆకుల దుర్గ,సూర్యప్రకాష్ రెడ్డి,అప్పలరాజు,పెండ్ర రాజు,అవంతి,సచివాలయ సిబ్బంది,అంగన్వాడీ కార్యకర్తలు,ఆశ కార్యకర్తలు,ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

 

Tags; Perfect health with nutrition

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page