వినాయక చవితి పూజలో శాస్త్రీయ విజ్ఞానం – డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు

0 9,670

తిరుపతి  ముచ్చట్లు:

 

వినాయక చవితి సందర్భంగా వినియోగించే పత్రాలు, ఫలాలు, పుష్పాల్లో గొప్ప ఔషధగుణాలు ఉన్నాయని, ఈ పర్వదినం వెనుక ఎంతో శాస్త్రీయత ఉందని ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్వేత భవనంలో గల వెంగమాంబ హాలులో గురువారం టిటిడి ఉద్యోగులతో వినాయక చవితి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా వినాయక చవితి విశిష్టత – పూజావిధానం – శాస్త్రీయత అనే అంశంపై  శ్రీనివాసరావు ఉపన్యసించారు. తిరుమల కొండపై ఉన్న చెట్టు చేమ, రాయి అన్నీ దైవాంశ అన్నారు. స్వామివారి సన్నిధిలో ఉద్యోగం గొప్ప సేవాభాగ్యమని చెప్పారు. విఘ్నేశ్వర పూజవల్ల తెలివితేటలు, నిశిత పరిశీలన, జ్ఞాపకశక్తి విజయాలు సిద్ధిస్తాయన్నారు. అనంతరం వినాయకుడి కథ చదివి వినిపించారు.

 

 

- Advertisement -

శ్వేత డైరెక్టర్ డా.ఎ.రామాంజులరెడ్డి మాట్లాడుతూ హిందూ సంస్కృతి, సంప్రదాయాలను ఉద్యోగులు తప్పక పాటించాలన్నారు. పండుగలు ఇందులో భాగమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ  అరుణాదేవి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ డా. ఆకెళ్ల విభీషణ శర్మ, 80 మంది ఉద్యోగులు, అన్ని ప్రాజెక్టుల సిబ్బంది, శ్వేత సిబ్బంది పాల్గొన్నారు.

వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్న తెలుగుముచ్చట్లు

Tags: Scientific knowledge in Vinayaka Chaviti Puja – Dr. Mylavarapu Srinivasa Rao

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page