సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం

0 9,717

హైదరాబాద్ ముచ్చట్లు:

 

సాయుధ పోరాట వారోత్సవాలను సీపీఐ తెలంగాణ శాఖ హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభించింది. ట్యాంక్ బండ్ పై ఉన్న ఆధునిక మహా కవి మగ్దుమ్ మోహియుద్దీన్ విగ్రహం వద్ద… ఈ నెల 11 నుంచి 17వరకు జరగనున్న సాయుధ పోరాట వారోత్సవాలను సీపీఐ హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో… సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు అజీజ్ పాష, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నైజాం నిరంకుశత్వ పాలన నుంచి విముక్తి కై సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వీరులు… రావి నారాయణ రెడ్డి, ముగ్దుమ్ మోహియుద్దీన్, బద్ధం ఎల్లారెడ్డి చిత్ర పాఠాలకు వారు నివాళులు అర్పించారు. ఎరుపు రంగు చొక్కాలు ధరంచి ట్యాంక్ బండ్ పై ర్యాలీ సీపీఐ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.  నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వీరులకు విప్లవాభివందనాలు చేశారు. సీపీఎం చేసిన సాయుధ పోరాటం ఫలితంగానే నాటి నిజాం నిరంకుశ పాలన రద్దైందని నారాయణ, చాడ తెలిపారు. మజ్లీస్ పార్టీకి తొలొగ్గి ముఖ్యమంత్రి కేసీఆర్ సాయుధ పోరాటాన్ని అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రం అధికారంలోకి వచ్చిన భాజపా… ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడమే కాకుండా… ప్రజల మధ్య మతోన్మాద చిచ్చు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

సినీ హీరో సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం

Tags: Armed Combat Week festivities begin

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page