2024 కోసం బుర్ర‌కు ప‌దును

0 9,700

గుంటూరు‌ ముచ్చట్లు:

 

చంద్రబాబు మైకు పట్టుకుంటే గంటల తరబడి మాట్లాడుతారు. ఆయన పెద్ద వక్త కాదు కానీ చెప్పిందే చెబుతూ తన భావాలను జనం బుర్రలోకి తోసేయాలని తాపత్రయంతో అది అలా సుదీర్ఘ ప్రసంగం అవుతుంది. ఇక చంద్రబాబు మీడియా మీటింగులూ, పార్టీ మీటింగులు కూడా అలాగే ఉంటాయి. నిజం చెప్పాలంటే బాబు ఏంచేసినా చాలా లార్జి స్కేల్లోనే ఉంటుంది. ఇక చంద్రబాబు హామీలు కూడా కోటలు దాటుతాయి. ఆయన రెండు సార్లు ఓడిపోయి 2014 ఎన్నికలకు రెడీ అయినా వేళ ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక చూస్తే అదొక బుక్ మాదిరిగా ఉంటుంది. దాని నిండా వందల కొద్దీ హామీలే. ఆరు వందలకు పైగా ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతారు. అదంతా బాబు గెలవడం కోసం ఏపీలోని 13 జిల్లాల్లోని ప్రతీ సెక్షన్ని వదలకుండా ఇచ్చిన హామీల జల్లు అన్నమాట.ఇపుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు అన్నది చంద్రబాబు ఇపుడు తెగ అధ్యయనం చేస్తున్నారు. తాను ఇవ్వలేనిది ఏంటి, జగన్ ఇచ్చినదేంటి ఇదే చంద్రబాబును తొలుస్తున్న ప్రశ్న. తాను ఎంతో చేశాను అనుకుంటే జనం జగన్ ని ఎందుకు ఇష్టపడ్డారూ ఇది కూడా బాబుకుని నిరంతరం కలవరపెడుతున్నదే. అయితే చంద్రబాబు దీనికి సమాధానాలు ఆలోచించలేని స్థితిలో ఏమీ లేరు. ఆయనకు తెలుసు తాను ఎక్కడ ఫెయిల్ అయ్యానో, అలాగే జగన్ సక్సెస్ ఎక్కడ ఉందో. దాంతో బాబు ఆలోచనలు అన్నీ కూడా 2024 నాటి హామీల మీదనే పరచుకుని ఉన్నాయని అంటున్నారు.ఇక 2024 నాటికి రాష్ట్ర జనాభా ఆరు కోట్లు అవుతుంది అనుకుంటే వారినెవరినీ వదలకుండా చంద్రబాబు అందరికీ హామీలు గుప్పించే అవకాశం ఉందని అంతా ఊహిస్తున్నదే.

 

 

 

 

- Advertisement -

ఆ విధంగా తీసుకుంటే 2014 నాటి 600 హామీలు 2024 నాటికి ఆరువేల హామీలు అవుతాయి. అలాగే ఇక ఎన్నికల ప్రణాళిక పుస్తకం కూడా చాలా పెద్దదిగా ఉంటుందని కూడా అంటున్నారు. దీనిని చెప్పడానికి పెద్దగా ఆలోచించనవసరం లేదు. చంద్రబాబు రాజకీయాన్ని చూసిన వారికి అది సులువుగా అర్ధమయ్యేదే. బాబు హామీలు ఎన్ని అయినా ఇస్తారు, ఏమైనా చేస్తారు, ఆయనకు ఒక విధంగా 2024 చివరి ఎన్నికలు. తాడో పేడో అన్న మాట. ఇక జగన్ వరసగా రెండవ సారి కూడా అధికారంలోకి వస్తే చంద్రబాబు టీడీపీ చరిత్రలో కలసిపోవడం ఖాయమే.రాజకీయ విశ్లేషకులు కాస్తా తొందరపడి 2024 ఎన్నికల గురించి మాట్లాడుకోవడం సహజం. కానీ వైసీపీ మంత్రి కొడాలి నాని కూడా అప్పటికి చంద్రబాబు ఏమేమి హామీలు ఇస్తారు, ఆయన తీరు ఎలా ఉంటుంది అన్నది తనదైన విశ్లేషణ చేస్తున్నారు. సెటైర్లూ వేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల మ్యానిఫేస్టో 2024 ఎన్నికల నాటికి ఏకంగా వేల పేజీలో ఉంటుందట. వారూ వీరూ అని చూడకుండా అందరికీ హామీలు గుప్పిస్తారట. అబద్దాలకు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఎన్ని అయినా చెబుతారుట. ఎందుకంటే చంద్రబాబుకు ఆ ఎన్నికల్లో కూడా తాను గెలవను అని పక్కాగా తెలుసట. దాంతో తీర్చేదా చేసేదా అని నోటికి ఎంత వస్తే అంత అన్నట్లుగా హామీలూ వరద పారిస్తారుట. ఆయినా చంద్రబాబుకు జనం అధికారం ఇవ్వరని కొడాలి నాని బాబు రాజకీయ‌‌ భవిష్యత్తు మీద నాలుగేళ్ళ ముందే జోస్యం చెప్పేశారు. సో చంద్రబాబు ఇప్పటినుంచే 2024 ఎన్నికల కొరకు భారీ ఎత్తున ఇచ్చే‌ హామీల పుస్తకం రాస్తున్నారు అనుకోవాలేమో

సినీ హీరో సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం

Tags: Burra will be ready for 2024

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page