ధాన్యం కోనుగోలు కేంద్ర నిర్వహకులపై చర్యల కోసం రైతుల ధర్నా

0 8,593

సూర్యాపేట ముచ్చట్లు:

 

సూర్యాపేట జిల్లా. మద్దిరాల మండలం మమిళ్ల గ్రామం లో రైతులకు మోసం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లో కి వచ్చింది.    ఐకేపీ ధాన్యం. కొనుగోలు కేంద్రాల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని మామిళ్ల గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఈ సందర్భంగా రైతులు ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వహణపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లోపిటిషన్ అందజేశారు.  ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రం లో ఒక బస్త తూకం 40 కెజిల 700 గ్రాములకు గాను క్వింటాకు 5 కేజీల చొప్పున అదనంగా ఎలక్ట్రానిక్ కాంటలో మోదలే పిడింగ్ చెసుకున్నా ఐకేపి నిర్వహకులు ఈ మోసం చేసిన 10లక్షల  సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఐకెపి నిర్వాహకుల లో నలుగురు కలసి సెంటర్ నిర్వహించారు. ఈ మోసంతో వచ్చిన రూపాయలు పంపకాల విషయం  కుదరకపోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీనిపై ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.  సూర్యాపేట -దంతాలపెల్లి రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. రైతులకు తెలంగాణ సామాజిక న్యాయ వేదిక అధ్యక్షుడు  అనపర్తి జ్ఞాన సుందర్ సంఘీభావం తెలిపారు. రైతులకు   న్యాయం చెయ్యలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

సినీ హీరో సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం

Tags; Farmers’ dharna for action against central managers for buying grain

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page