పుంగనూరులో భార్యపై భర్త కత్తితో దాడి

0 8,645

పుంగనూరు ముచ్చట్లు:

 

 

తాగుడుకు బానిసైన భర్తకు భార్య డబ్బు ఇవ్వకపోవడంతో భార్యపై కత్తితో దాడి చేసి గాయపరచిన సంఘటన శనివారం మండలంలోని కంటేపల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన నారాయణకు భరిణేపల్లె గ్రామానికి చెందిన సంపూర్ణ(30)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గరు ఆడపిల్లలు. ఇలా ఉండగా మధ్యాహ్నం డబ్బు కోసం బార్యతో తగువలాడాడు. సంపూర్ణ డబ్బు ఇవ్వకపోవడంతో కత్తితో తలపై నరకడంతో ఆమెకు తలపై తీవ్రగాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు భాదితురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలించి, చికిత్సలు అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

సినీ హీరో సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం

Tags: Husband stabs wife in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page