రాజంపేట ఎంపి మిధున్‌రెడ్డి జన్మదిన వేడుకలు -వాడవాడల కేక్‌ కట్‌ చేసి, అన్నదానం

0 9,732

పుంగనూరు ముచ్చట్లు:

 

రాజంపేట ఎంపి, లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులతో కలసి ఘనంగా నిర్వహించారు. ఎంపి తల్లిదండ్రులు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వర్ణమ్మ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, సదుం జెడ్పిటిసి సోమశేఖర్‌రెడ్డి, యువజన సంఘనాయకుడు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పుంగనూరు మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కార్యదర్శులు దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌ , మాజీ ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో ఉలవలదిన్నె క్రాస్‌లో ప్లెక్సిలు ఏర్పాటు చేశారు. కేక్‌ కట్‌ చేసి, ముఖ్యమంత్రి, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, సంబరాలు జరిపారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.పట్టణంలో రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు కెఎస్‌ఏ.ఇఫ్తికార్‌అలీఅహమ్మద్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, కౌన్సిలర్‌ అమ్ము ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎంపి నిలువెత్తు కటౌటును ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మిధున్‌రెడ్డి యువసేన నేతలు రాజేష్‌, సురేష్‌, బండకుమార్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చౌడేపల్లె మండల కేంద్రంలో పంచాయతీరాజ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ అంజిబాబు , వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, బోయకొండ చైర్మన్‌ మిద్దింటి శంకరనారాయణ, వైఎస్‌ఆర్‌సిపి యువజన సంఘ నాయకుడు కళ్యాణభరత్‌ తదితరులు కేక్‌ కట్‌ చేసి, అన్నదానం నిర్వహించారు. సోమల మండల కేంద్రంలో మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమాలలో ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, కౌన్సిలర్లు పూలత్యాగరాజు, అర్షద్‌అలీ, నరసింహులు, నటరాజ, రామకృష్ణమరాజు, రాఘవేంద్ర, మైనార్టీ నాయకులు అస్లాంమురాధి, నవాజ్‌, నూరుల్లా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

సినీ హీరో సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం

Tags: Rajampet MP Midhunreddy Birthday Celebrations – Vadavadala Cake Cut and Annadanam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page