సినీఫక్కీలో దారి దోపిడీ….. రహస్య విచారణ చేస్తున్న పోలీసులు  మైలవరం

0 9,689

హైదరాబాద్‌ ముచ్చట్లు:

సినీఫక్కీలో జరిగిన  దారి దోపిడీ కేసును పోలసులు రహస్య విచారణ చేస్తున్నారు. మైలవరం మండలం పుల్లూరులో శుక్రవారం తెల్లవారుజామున రు.7 లక్షలు దారి దోపిడీ జరిగిన విషయం తెలిసిందే.  జయంతి నుంచి మండపేట కు రెండు లారీల్లో పి డి ఎస్ బియ్యం అక్రమంగా తరలించారు. బియ్యం అమ్మిన సొమ్ము ఏడు లక్షలు ఇద్దరు లారీ డ్రైవర్ లలో ఒకరికి అప్పగించారు. ఏడు లక్షల నగదు పై కన్నేసిన మరో లారీ డ్రైవర్.ఖమ్మం కు చెందిన దోపిడీ ముఠాతో కుమ్మక్కై నగదు దోపిడీ కి స్కెచ్ వేసారు. మైలవరం మండలం పుల్లూరు సమీపంలోని కోళ్ల ఫారాల వద్ద కు లారీలు రాగానే దోపిడీ ముఠా అడ్డగించింది. ముందు లారీ డ్రైవర్ కి వెనకాల లారీలో సొమ్ము ఎక్కడ ఉందో తెలియడంతో పది నిమిషాలలో సొమ్ము తీసుకొని దోపిడీ ముఠా పరారీ అయింది. బాధిత లారీ డ్రైవర్  మైలవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు.  దోపిడీ విషయాన్ని గోప్యంగా ఉంచిన మైలవరం పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరు లారీ డ్రైవర్ లపై అనుమానం తో అదుపులోకి తీసుకున్నారు. దాంతో అసలు  విషయాన్నీ దొంగ డ్రైవర్ పోలీసులకు తెలిపాడు.  ఖమ్మం లో స్పెషల్ టీమ్ తో దోపిడీ ముఠా కోసం గాలిస్తున్నట్లు సమాచారం. దోపిడీ ముఠా లో ఒక కానిస్టేబుల్ కొడుకు ఉన్నట్లు కుడా తెలిసింది.

- Advertisement -

సినీ హీరో సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం

Tags: Road robbery in Sinifakki .. Police are conducting a secret investigation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page