నిలకడగా సాయి ధరమ్ తేజ ఆరోగ్యం

0 9,867

హైదరాబాద్ ముచ్చట్లు:

 

రోడ్డు ప్రమాదానికి గురైన టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. సాయిధరమ్ తల, ఛాతి, ఇతర భాగాల్లో తీవ్రమైన గాయాలు లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఉదయం ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసారు.  శుక్రవారం స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయిధరమ్‌ తేజ్‌  ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. దాంతో తీవ్ర గాయాలు అయిన సంగతి తెలిసిందే.  బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రోడ్డు పై ఇసుక వుండడం, ఆదే సమయంలో అయన బైకు బ్రేకులు వేయడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో అయన మద్యం తాగలేదని పోలీసులునిర్దారించారు.   బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు మాదాపూర్‌ సీఐ తెలిపారు.

- Advertisement -

సినీ హీరో సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం

Tags; Stable Sai Dharam Teja Health

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page