బోయకొండలో దసరా మాహోత్సవ పోస్టర్లు ఆవిష్కరణ

0 9,759

–శరన్నవరాత్రులను •వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు
— మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిచే అమ్మవారికిపట్టువలు సమర్పణ
— ఇరవై రోజుల్లో పనులన్నీ పూర్తిచేయాలి

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

జిల్లాలో నాల్గవ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయంలో అక్టోబరు 7 నుంచి 15వతేది వరకు నిర్వహించబోయే దసరా మాహోత్సవాల పోస్టర్లును ఆదివారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. ఆలయ అడ్నినిస్ట్రేటివ్‌ కార్యాలయంలో చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఏఐపీపీ మెంబరు అంజిబాబు, ఈఓ చంద్రమౌళితో కలిసి పోస్టర్లు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా బోయకొండలో దసరా మాహోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం తరపున మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఒకొక్క రోజు ఒక అలంకారంలో అమ్మవారిని ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకొన్నామన్నారు. అక్టోబరు 7నఅమ్మవారిని శ్రీ బాలాత్రిపుర సుంధరీ దేవి, 8న మహాలక్ష్మిదేవి,9న శాకాంబరీదేవి,10న ధనలక్ష్మిదేవి,11పార్వతీదేవి,12న సరస్వతిదేవి,13న దుర్గాదేవి, 14నమహిషాసురమర్థినిదేవి ,15న రాజరాజేశ్వరిదేవి ఆలంకారంలో దర్శనమివ్వనున్నట్లు తెలిపారు. ఉభయదారులుగా వ్యవహరించాల్సిన భక్తులు రూ:5116 చెల్లించి ఆలయంలో రశీదుపొందాలని సూచించారు. అలాగే మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆలయం వద్ద కోట్లాది రూపాయల నిధుల తో జరుగుతున్న పలు అభివృద్దిపనులను ఇరవై రోజుల్లో పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్‌లను ఆదేశించారు. మంత్రి పర్యటన లో బోయకొండలో పలు అభివృద్దిపనులను ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసి ఆలయానికి అంకితం చేయనున్నారని, ఆదశగా పనులు పూర్తిచేయాలని సూచించారు. వారి వెంట సింగిల్‌విండో చైర్మన్‌ రవిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ రమేష్‌రెడ్డి,డైరక్టర్‌ రమేష్‌బాబు, బిసి కార్పొరేషన్‌ డైరక్టర్‌ లడ్డూరమణ,నేతలు కళ్యాణ్‌భరత్‌, షేక్‌ బావాజీ, నవీన్‌,అల్తాఫ్‌, ప్రభాకర్‌యాదవ్‌, శ్రీనాథ్‌,సూరి తదితరులున్నారు.

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: Dasara Mahgatsava posters unveiled at Boyakonda

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page