పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

0 9,366

-కేసునమోదు చేసిన పోలీసులు

పుంగనూరు ముచ్చట్లు :

 

- Advertisement -

అభం శుభం తెలియని ఐదేళ్ల మైనర్‌ బాలికపై సుమారు 15 సంవత్సరాలు వయసు కలిగిన మైనర్‌బాలుడు అత్యాచారం చేయడంతో పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసిన సంఘటన ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ప్రకాశం కాలనీలో దళిత కుటుంబానికి చెందిన మైనర్‌ బాలిక గణేష్‌ పూజల వద్ద ఉండగా అదే సామాజిక వర్గానికి చెందిన మైనర్‌ బాలుడు చాక్లెట్లు ఇస్తానంటు నమ్మించి శనివారం సాయంత్రం తీసుకెళ్లాడు. మైనర్‌ బాలికను వివస్త్రతను చేసి అత్యాచారం చేశాడు. బాలిక కేకలు వేయడంతో ఆప్రాంత వాసులు బాలుడిని పట్టుకుని బాలిక తల్లికి విషయం తెలిపారు. దీనిపై రాత్రి బాలిక తల్లి సీఐ గంగిరెడ్డికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఐ సంఘటన స్థలాన్ని సందర్శించి, బాలికను వైద్య పరీక్షలకు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మైనర్‌ బాలుడిపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

 

సినీ హీరో సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం

Tags:Minor boy rapes girl in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page