పుంగనూరులో ఆర్టీసి డ్రైవర్లు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి – సీఐ గంగిరెడ్డి

0 9,987

పుంగనూరు ముచ్చట్లు:

 

ఆర్టీసి డ్రైవర్లు చెడు అలవాట్లకు దూరంగా ఉంటు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సీఐ గంగిరెడ్డి కోరారు. ఆదివారం ఆర్టీసి డిపో మేనేజర్‌ సుధాకరయ్య ఆధ్వర్యంలో ప్రమాదరహిత పక్షోత్సవాల ముగింపు కార్యక్రమం డిపోలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ డ్రైవర్లు మధ్యం సేవించడం, దురువేసనాలకు అలవాటు పడరాదన్నారు. ముఖ్యంగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే ప్రయాణికుల ప్రాణాలకు ముప్పువాటిల్లుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు ప్రయాణికుల క్షేమం కోరుతూ విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, ఆర్టీసి సంఘ నాయకులు కరీముల్లా, సిఎం.బాషా, అన్వర్‌, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

సినీ హీరో సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం

Tags: RTC drivers in Punganur should stay away from bad habits – CI Gangireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page