16న కాంగ్రెస్ పార్లమెంటరీ సమీక్ష సమావేశం

0 9,703

– హాజరుకానున్న ఇంచార్జి మాణిక్యం ఠాగూర్

 

మహబూబ్ నగర్ ముచ్చట్లు:

- Advertisement -

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఈనెల 16న కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంటు విస్తృత స్థాయి సమీక్ష సమావేశం ఉంటుందని జిల్లా కాంగ్రెస్ మీడియా సెల్ కన్వీనర్ సిజె బెనహర్ వెల్లడించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టిపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లురవి,  వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ స్థితిగతుల పై సమీక్ష ఉంటుందన్నారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 11 గంటలకు డిసిసి అధ్యక్షుడు ఉబెదుల్ల కొత్వాల్ అధ్యక్షతన ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పార్లమెంటు పరిధిలోని జిల్లా కార్యవర్గం సభ్యులు, రాష్ట్ర నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు హాజరు కావాలని ఆయన కోరారు.

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: Congress Parliamentary Review Meeting on the 16th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page