భారీ మొత్తంలో చేపలు మృత్యువాత

0 4,233

విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ పరవాడ మండలం పరవాడ గ్రామం పెద్దచెరువులో ఫార్మా  వ్యర్ధ విషపూరిత రసాయనాలు కలవడం వలన పెద్ద మొత్తంలో చేపలు మృత్యువాత పడటం వలన చేరువులో చేపల పెంపకందారులు లబోదిబోమంటున్నారు.     పరవాడలో  భూగర్భ జలాలు మొత్తం ఫార్మా వ్యర్థాలతో కలుషితమవుతున్నాయి అని  గతంలో కూడా ఇదే మాదిరిగా ఫార్మా వ్యర్ధాలు వలన చేపలు మృతి చెందడంతో  ,ఆయుకట్టుదారులు పెద్దచెరువు  దగ్గర తొమ్మిదిరోజులు నిరసన దీక్ష నిర్వహించారు.
.అధికారపార్టీ నాయకులు రైతులకు మద్దతు పలికి  తూతూమంత్రంగా మారారని వారు విమర్శిస్తున్నారు. వారంతా  ఫార్మా యాజమాన్యాలను రప్పించి చెరువుల సుందరీకరణకు , రైతులకు నష్టపరిహారం వంటి మోసపూరిత హామీలు ఇప్పించి దీక్ష
విరమింపజేసారు.  కాని నాటి నుంచి నేటి వరకు రైతులకు ఎటువంటి నష్ట పరిహారం అందలేదు కదా, పెద్ద చెరువు, ఊర చెరువుల సుందరీకరణ జరగనులేదని రైతులు మండిపడుతున్నారు.    ఫార్మా యాజమాన్యాల నిర్లక్ష్యధోరణి రైతులపాలిట శాపంగా మారుతున్నాయి.అధికారపార్టీ నాయకుల అసమర్ధత ఫార్మా యాజమాన్యాలకు వరంగా మారాయి.   ఇప్పటికే లక్షలో నష్టాలు వచ్చి చేపల పెంపకందారులు గగ్గోలు పెడుతున్నారు.ఇప్పటికైనా అధికారపార్టీ నాయకులు ఫార్మాయాజమాన్యాలు ఇచ్చిన మాట ప్రకారం చెరువులోకి ఫార్మా వ్యర్ధాలను రాకుండా చేసి చెరువులను సుందరీకరణ,రైతులకు నష్ట పరిహారం ఇప్పించే విదంగా చొరవ చూపాలని పెద్దచెరువు ఆయుకట్టదారులు,ప్రజలు కోరుతున్నారు.

 

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

- Advertisement -

Tags:Huge amounts of fish die

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page