పెరిగిన ప‌త్తి..త‌గ్గిన వ‌రి

0 9,696

రంగారెడ్డి  ముచ్చట్లు:

 

రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా నియంత్రిత పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో పత్తి పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు. గతేడాది కంటే ఈ సారి ఎక్కువగా పత్తి పంట సాగవుతోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సాగు చేసిన పత్తి పంట ఏపుగా పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ చీడపీడల బెడద పెరుగుతోంది. నివారణకు అవసరమైన మందులను రైతులు పిచికారి చేస్తున్నారు. దీంతో అన్నదాతలు దిగుబడిపై భారీ ఆశలు పెట్టుకుంటున్నారు. తమ కష్టానికి అనుగుణంగా ధరలు నిర్ణయించాలని, ప్రభుత్వమే పండించిన పత్తిని కొనుగోలు చేస్తే ఆశించిన లాభాలు అందుతాయంటున్నారు. కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఏర్పాటు చేస్తే రవాణా భారం తగ్గుతుందని రైతులు పేర్కొంటున్నారు.పంట 62,805 ఎకరాల్లో సాగు చేశారని అధికారులు అంచనా. అధికారికంగా గతేడాది జిల్లా వ్యాప్తంగా 87,423 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా, ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన వివరాల ప్రకారం 62,805 ఎకరాల్లో సాగు చేశారు. దీంతో జిల్లాలో ఎక్కడ చూసినా పత్తి పంటనే కనిపిస్తోంది. వరి, మొక్కజొన్న పంటలను సాగు చేయొద్దని అధికారులు ముందస్తుగా సూచించడంతో వాటికి బదులుగా పత్తిని సాగు చేశారురంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలోనే పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చేతులు దులపుకుంటున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే మూతపెడుతున్నారు. దాంతో రైతులు మధ్యదళారుల చేతుల్లో మోస పోతున్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నం డివిజన్‌లో సాగు చేసిన పత్తిని విక్రయించుకోవాలంటే ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాన్ని సంఘీ జిన్నింగ్‌ మిల్లులో విక్రయించాలని చెబుతుండటంతో దూరభారం పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 

 

 

- Advertisement -

ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల, కందుకూర్‌, మహేశ్వరం మండలాలకు చెందిన రైతులు తమ పత్తిని విక్రయానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షాద్‌నగర్‌ డివిజన్‌లో మూడు జిన్నింగ్‌ మిల్లులైన షాద్‌నగర్‌ డివిజన్‌ కేంద్రం, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ, అమిత్‌ కాటన్‌మిల్లు, విష్ణు జిన్నింగ్‌ మిల్లులో ఏర్పాటు చేస్తుండటంతో రైతుల రద్దీ అధికంగా ఉంటుంది. అంతే కాకుండా ఉమ్మడి మహాబూబ్‌నగర్‌ జిల్లాలోని మిడ్జిల్‌, నారాయణపేట, మహాబూబ్‌నగర్‌, నవాబ్‌పేట, బాలానగర్‌, పరిగి, దోమ మండలాల నుంచి కూడా షాద్‌నగర్‌ కొనుగోలు కేంద్రాలకు పత్తి విక్రయాలకు వస్తుంటాయి, దాంతో రద్దీ అధికంగా ఉంటుంది. దాంతో పత్తి విక్రయానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ ఏడాది దిగుబడి సైతం ఎక్కువగా ఉంటుందని మండలాల వారిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రైతులకు మేలు జరుగుతుందని పలువురు రైతులు అభిప్రాయ పడుతున్నారు.జిల్లాలో వరి సాగు గణనీయంగా తగ్గింది. సమృద్ధిగా వర్షాలు లేకపోవడంతో వరి సాగుకు నోచుకోలేదు. ఈ సారి వరి సాధారణ విస్తీర్ణం 36వేల హెక్టార్లు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ కేవలం 200 ఎకరాలు కూడా సాగుకు నోచుకోలేదు. అందుకు సమృద్ధిగా వర్షాలు లేకపోవడమే కారణం. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పత్తి, కంది, జొన్న, పెసర్లు మినుముల, ఆముదం, వేరుశనగ, ఇతర కూరగాయల పంటలకు మేలు కలుగుతుంది.

 

 

 

 

కానీ వరి పంట సాగుకు అవసరమైన భూగర్భజలాలు పెరగలేదు. పైగా చెరువులు, కుంటలు, బోరు బావులు నీరు వెలవెలబోతున్నాయి. గత ఏడాది మాదిరిగానే యాసంగి పంట మాత్రమే పండే అవకాశాలున్నాయి.జిల్లాలో వానాకాలం పంటల సాగును పరిశీలిస్తే.. మొత్తం 3,99,561ఎకరాల్లో పంటల సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వీటిలో పత్తి సాగు248,357ఎకరాల్లో సాగు చేస్తారని బావిస్తే, 62,805 ఎకరాల్లో సాగు చేశారు. ఇక వరి 36,000 ఎకరాలకు సుమారు 200 ఎకరాలు కూడా సాగుకు నోచుకోలేదు. ఇక కందులు 82,554 ఎకరాలు సాగు అంచనా వేయగా, 6వేల ఎకరాల వరకు సాగు చేశారు. జొన్న 27,077ఎకరాలకు 5వేలు, పెసర్లు 373ఎకరాలకు 200 ఎకరాల వరకు, ఇతర పంటలు 4,691ఎకరాలకు 12వందల ఎకరాల వరకు సాగు చేశారు.జిల్లాలో సాధారణ వర్షపాతం 694.6మిల్లీ లీటర్ల వర్షాపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 394.7మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదైంది.  జిల్లాలో అత్యధికంగా కేశంపేట మండలంలో 15.8మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక శంషాబాద్‌లో 6.8మిల్లీమీటర్లు నమోదు చేసుకుంది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ స్థాయిలో వర్షం నమోదైతే చెరువులు, కుంటల్లోకి నీరు చేరే అవకాశాలున్నాయి. తద్వారా ఆలస్యంగానైన వరిని సాగు చేసే అవకాశాలున్నాయి.

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: Increased cotton .. reduced paddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page