పులి సంచారం భయాందోళనలో గ్రామస్థులు

0 8,453

మంచిర్యాల ముచ్చట్లు:
మంచిర్యాల జిల్లా  భీమిని మండలం చిన్నగుడిపేట  గ్రామంలో పులి సంచారం కలకలం రేపుతోంది.  పత్తి చేన్లలో, నెరేళ్ల వాగు పరిసర ప్రాంతంలో పులి అడుగు జాడలను గ్రామస్థులు కనుగొన్నారు. అనంతరం సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు అందించారు. సమీప గ్రామ సమీప పత్తి చెనులలోపులి అడుగుజాడలు కనిపించడంతో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు.పులి అటవీ ప్రాంతాల నుంచి వచ్చినట్లుగా గ్రామస్థులుఅనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామం కొమురంభీం జిల్లా దహేగం  మండలం సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. స్థానిక అటవీ శాఖ అధికారులు అడుగుజాడలను పరిశీలిస్తుండగా ఒక్కసారి గ్రామస్థులకు, అటవీ శాఖ అధికారులకు పులి కనబడటంతో ప్రజలను అప్రమత్తం చేసినారు. రెబ్బన రేంజ్ అధికారి పూర్ణిమ, డిప్యూటీ రేంజర్ శ్రీధర్ చారి వచ్చి గ్రామస్థులతో మాట్లాడారు. పులి తిరుగుతుందంటూ గ్రామంలో దండోరా వేయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రజలు పత్తి చెను వద్దకు వెళ్లకూడదంటూ మైక్ ద్వారా ప్రచారం చేశారు.

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

- Advertisement -

Tags:Villagers in panic as the tiger roams

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page