రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు

0 8,456

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా కోవూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోవూరు లోని స్థానిక అనకాపల్లి కళ్యాణ మండపం వద్ద ఓ కారు డివైడర్ ను  ఢీ కొట్టి బోల్తా కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే కోరు నుండి నెల్లూరు వైపు వెళుతున్న మారుతి సుజుకి బాలెనొ కారు ఓటు ఓ డివైడర్ను డికొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. కారు పల్టీలు కొట్టడంతో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు ముందు సీట్లో కూర్చుని ప్రయాణిస్తున్న వారి పరిస్థితి  తీవ్ర విషమంగా ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. గాయపడిన వారిని హుటాహుటిన నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కోవూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం లో ఉన్నప్పుడు డ్రైవర్ నిద్రపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు అంటున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags:Five people were seriously injured in a road accident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page