విద్యుత్ చార్జీల పెంపుపై పోరాటానికి సిద్దం

0 9,692

విజయవాడ ముచ్చట్లు:

 

విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని జనసేన నేత పోతిన వెంకట మహేష్ విమర్శించారు. మంగలవారం అయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే రెండు సార్లు విద్యుత్ శ్లాబులు మార్చి ఐదు వేల కోట్ల భారం వేశారు. జగనన్న కరెంటు షాక్ పధకంతో షాకిస్తున్నారు. ఇప్పుడు విద్యుత్ వాడకంతో సంబంధం లేకుండా బిల్లులు వేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఈ తరహా భారాలు మోపలేదు. ట్రూ అప్ ఛార్జీల. పేరుతో వడ్డీలువేసి మరీ వసూలు చేస్తున్నారు. గత ఐదేళ్లలో వాడుకున్న విద్యుత్ కు ఛార్జిలు వసూళ్లు ఏంటి. 6,300 వేల కోట్లు వసూళ్లు చేయాలని జగన్ నిర్ణయించారు. ఇప్పుడు యూనిట్ కు రెండు రూపాయలు చొప్పున మరో తొమ్మిది వేల కోట్ల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. రాబోయే రెండేళ్లపాటు ఈఛార్జీలు అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక జగన్ దోపిడీ కూడా ఉంది. ప్రైవేటు విద్యుత్ సంస్థలు నుంచి ఆరు నుంచి ఎనిమిది రూపాయలు కు ఎందుకు కొనుగోలు చేస్తున్నారు. కేంద్రం నుంచి తక్కువ ధరకు విద్యుత్ ఇస్తున్నా ఎందుకు తీసుకోరు. ప్రైవేటు సంస్థలు తో ఒప్పందం ద్వారా జగన్ కమిషన్లు తీసుకుంటున్నారు. ట్రూ అప్ ఛార్జీలు తో ఎందుకు వసూళ్లు చేస్తున్నారో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలి. రైతాంగం పై కూడా ఈ విద్యుత్ భారాలు మోపుతున్నారు.

 

 

- Advertisement -

అద్దె దారులు ఈ విద్యుత్ ఛార్జీల భారం ఎలా మోస్తారు. కరోనా సృష్టించిన కల్లోలం కన్నా.. జగన్ కల్లోలమే ఎక్కువుగా ఉంది. ఒక్కఅవకాశం జగన్ కు ఇచ్చినందుకు రాష్ట్రం విధ్వంసానికి గురవుతుంది. యనభై లక్షల మంది వరకు ఉపాధి కోల్పోయారు. 30,160 యూనిట్లను మాత్రమే విద్యుత్ వినియోగం జరిగింది. విద్యుత్ వాడకం పెరిగిందని ప్రభుత్వమే అబద్దాలు చెబుతుంది. యాభై వేల కోట్ల పన్నుల భారాలను కూడా మోపారు. ఇప్పుడు15,300కోట్లు విద్యుత్ ఛార్జీల వసూళ్లు. మద్యం అమ్మకాల పేరుతో 20వేల కోట్లు భారం వేశారు. సంక్షేమ పాలన లేదు… సంక్షోభ పాలన మాత్రమే ఎపి లో నడుస్తుంది. ఒక్క అవకాశమే చివరి అవకాశమని ప్రజలే చెబుతున్నారు. అన్ని దారుల్లో వాయింపుడు మీద వాయింపుడు… షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. జగన్… అంధ్రాని కాదు… ఆఫ్ఘనిస్తాన్ పాలనకు కరెక్ట్ గా సరిపోతారు. అక్కడ మత్తు మందులు, దోపిడీ దారులకు అండగా ఉంటారు. మంచి తాలిబన్ నేతగా అక్కడ జగన్ ను గుర్తిస్తారు. ఇష్టం వచ్చినట్లుగా మోపుతున్న భారాలను రద్దు చేయాలి. లేదంటే ప్రజలను కలుపుకుని తిరుగుబాటు చేస్తామని అన్నారు.

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: Get ready to fight the hike in electricity charges

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page