ఎమ్మెల్యే కోటంరెడ్డి తలపెట్టిన ‘నేను నా కార్యకర్త’  విజయవంతం కావాలి

0 8,788

-108 టెంకాయలు కొట్టిన రూరల్ నియోజకవర్గ వైకాపా నాయకులు

నెల్లూరు   ముచ్చట్లు:

- Advertisement -

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  ఈ నెల 16న స్థానిక అపోలో హాస్పిటల్ నుండి  ప్రారంభించనున్న” నేను నా కార్యకర్త “కార్యక్రమం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ స్థానిక శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రూరల్ నియోజకవర్గ వైకాపా నాయకులు 108 టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్త మంచిచెడులు తెలుసుకునేందుకు స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేను నా కార్యకర్త 42 రోజుల  పాదయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయం గా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం వైకాపా రాష్ట్ర కార్యదర్శి వై.వి రామిరెడ్డి సూచనలు, సలహాలు, ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందని తెలిపారు. శ్రీ శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో నేను నా కార్యకర్త పాదయాత్ర కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థించారు. తన తుది శ్వాస వరకు గ్రామీణ నియోజవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమే తన ధ్యేయంగా, సేవలందిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జీవిత కాలం వరకు గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు గా కొనసాగాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో 30,31 డివిజన్ల వైకాపా నాయకులు ఎం సతీష్, వీరప్ప రెడ్డి నారాయణ రెడ్డి, వడ్డే పార్థసారథి, ఆర్ కమల్ రాజ్, డి. శ్రీకాంత్, మోహన్ రావు, నవీణ్ కుమార్ రెడ్డి, నందకుమార్, శివ, గుడి మురళి, ఎస్కే నాయబ్ రసూల్, ఖాదర్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags:‘I am my activist’ headed by MLA Kotamreddy should be successful

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page