పుంగనూరు భాష్యం స్కూల్లో అంతర్జాతీయ ఫస్ట్ ఎయిడ్ దినోత్సవం

0 9,675

పుంగనూరు ముచ్చట్లు:

 

అంతర్జాతీయ ఫస్ట్ ఎయిడ్ దినోత్సవం సందర్భంగా గా స్థానిక భాష్యం స్కూల్ నందు పిల్లలకు ప్రథమ చికిత్స గురించి లైన్స్ క్లబ్ ప్రతినిధి డాక్టర్ సరళ అవగాహన కలిగించారు.ప్రధమ చికిత్స యొక్క అవసరం వివిధ రకాల ప్రమాదకరమైన పరిస్థితుల నుండి చిన్న చిన్న జాగ్రత్తల వల్ల ప్రాణాపాయం నుండి ఎలా తాము తప్పించుకోవాలి ఇతరులను ఎలా కాపాడాలిఅనే విషయాన్ని ని విద్యార్థులకు కూలంకుషంగా తెలియజేశారు. గాయాలైనప్పుడు, కాలినప్పుడు, పాము కాటు తేలు కాటుకు గురైన ప్పుడు, ప్రమాదాలు సంభవించినప్పుడు రక్తం కారే టప్పుడు గుండెకు ఊపిరితిత్తులకు సంబంధించిన అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎలా స్పందించాలి అనే విషయాలను తెలియజేశారు. విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్స గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటే చాలా మందిని ని అత్యవసర ప్రాణాపాయ పరిస్థితుల నుండి కాపాడవచ్చని తెలియజేసారు.ఈ అవగాహన కార్యక్రమంలో భాష్యం స్కూల్ సిబ్బంది విద్యార్థులు మరియు లైన్స్ క్లబ్ అధ్యక్షులు మహేందర్ రావు కార్యదర్శి శ్రీ రాములు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: International First Aid Day at Punganur Commentary School

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page