ఉరి కాదు.. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తెస్తున్నాం-ఎంపీ మోపిదేవి

0 8,756

తాడేపల్లి ముచ్చట్లు:

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులను అన్నివిధాలా ఆదుకుంటూ, వారికి మరింత మేలు చేకూరేలా నిర్ణయాలు చేస్తుంటే, టీడీపీ-బీజేపీ నేతలు ఉరి అంటూ.. గోబెల్స్ తరహాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు  మోపిదేవి వెంకట రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మత్స్యకారులతో  పాటు యావత్తు  బీసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు. ఇంతకాలం మత్స్యకార సొసైటీ సభ్యులకు కేవలం వెయ్యి రూపాయలు ఆదాయం మాత్రమే ఉన్న చెరువులకు సంబంధించి.. మత్స్యకారుల ఆదాయం రూ. 15 వేల వరకు పెరిగేలా నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్షాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయని మండిపడ్డారు. వంద హెక్టార్లు, ఆ పైన ఉన్న చెరువుల నిర్వహణ పేరుకు మాత్రమే మత్స్యకార సొసైటీల పరిధిలో ఉంటుందని, పెత్తనం అంతా దళారులదేనని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు 217 జీవో ద్వారా, నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద 27 చెరువులను బహిరంగ వేలం ద్వారా ఇస్తే ప్రతిపక్షాలు ఎందుకు రగడ సృష్టిస్తున్నాయని ప్రశ్నించారు. అంటే, ప్రతిపక్షాలు మత్స్యకారులకు అనుకూలమా.. లేక వ్యతిరేకమా అని మోపిదేవి సూటిగా ప్రశ్నించారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags:Not hanging .. We are bringing light in the lives of fishermen-MP Mopidevi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page