సముద్ర మార్గం ద్వారా తరలించే నాటు సారా ప్యాకెట్లు పట్టివేత

0 8,795

శ్రీకాకుళం ముచ్చట్లు:

ఒడిస్సా రాష్ట్రం గంజాం జిల్లాలో నాటు సారాను అక్రమంగా తయారు చేసి సముద్ర మార్గం ద్వారా రణస్థలం మండలం, దోనిపేట గ్రామంలోకి అక్రమంగా తరలిస్తున్న ప్రయత్నంలో భారీగా నాటు సారా ప్యాకెట్లు ను పట్టుకున్నట్టు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ  అమిత్ బర్థార్  తెలిపారు.ఈ మేరకు ఆయన మంగళవారం రణస్థలం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ నందు పత్రికా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.. జాయింట్ డైరెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, శ్రీకాకుళం, ఆసిస్టంట్ కమీషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, శ్రీకాకుళం వారి ఆద్వర్యంలో ముందుగా వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు తేదీ 13.09.2021 సుమారు 16.00 గంటలకు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్, ఇంటెలిజెన్సు,శ్రీకాకుళం,టేకినికాల్ వింగ్, శ్రీకాకులం వారి సహాయంతో,డిటిఎఫ్, ఎస్ఈబి,ఇన్స్పెక్టర్  రణస్తలం వారి సిబ్బంది కలసి దోనిపేట గ్రామం రణస్తలం మండలం లో జరిపిన దాడులలో ఒక నాటు సారా కేసు పట్టుకోవడం జరిగింది అని తెలిపారు.సదరు నాటు సారాయి పేకెట్లును ఒడిషా రాష్ట్రం,గంజాం జిల్లా, ఆగస్టమ్ నౌగాం వద్ద బలిగాం గ్రామంలో అక్రమంగా తయారు చేసి వాటిని సముద్రం మార్గం ద్వారా మీద మోటారు బోటు సహాయంతో దోనిపేట గ్రామానికి తరలించి అచట మరీ కొంత మంది ముద్దాయిలకు అంధచేయుచుండగా పట్టుబడినారుని అన్నారు.ఈ కేసు అందు (06) వ్యక్తులు ను అరెస్టు చేయడం జరిగిందిని,వారి వద్దనుంచి మూడు లక్షల అరవై వేల రూపాయలు విలువ చేసే (51) ప్లాస్టిక్ సంచులనందు (10,200) నాటు సారా పేకెట్లు (ఒక్కొకటి 180 ఎంఎల్ పరిమాణం గలవి) మొత్తం (1836) లీటర్లు,స్వాధీనపరచుకోని,ఒక ఆటొ,రెండు మోటార్ వాహనాలు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనపరచుకోవడం జరిగిందిని ఎస్పీ  వివరాలు వెల్లడించారు.ఈ పత్రిక సమావేశం లో జాయింట్ డైరెక్టర్ (యస్.ఈ.బి) కె. శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ (యస్.ఈ.బి),కె. గోపాల్, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags:Seizure of sara packets moving by sea route

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page