జిల్లాకు 43.56 కోట్లు వైద్య అభివృద్దికి 15 వ ఫైనాన్స్ కమిషన్ నిధులు

0 9,860

– సబ్ సెంటర్లు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో తప్పని సరిగా వైద్య పరిక్షలు

– జిల్లాలో 16 ప్రాంతీయ వైద్య సేవలు
– అర్బన్ ప్రాంతాలలో మరో 37  వైద్య శాలలు
– జిల్లా కలెక్టర్

- Advertisement -

చిత్తూరు ముచ్చట్లు:

 

జిల్లాలో వైద్య ఆరోగ్య పరిస్థులను మెరుగు పరిచేందుకు 15 వ ఆర్ధిక సంఘం 43.56 కోట్లు విడుదల చేయడం జరిగిందని, ఇందులో సబ్ సెంటర్ ల నుంచి అర్బన్ సెంటర్ ల వరకు నిర్మాణాలతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం 15 ఆర్ధిక సంఘం నిదులతో వైద్య సంస్థలను అభివృద్ధి చేయడం పై  కమిటీ సభ్యులతో కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సబ్ సెంటర్ల అభివృద్ధి కోసం మరియు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి 12 కోట్ల రూపాయాలు మరో 543 కేంద్రాల భవన నిర్మాణాలకు నిదులు మంజూరు చేసారని తెలిపారు. ఇందులో ఒక్కొక్కటి 5.54 లక్షలు ఏర్పాటు చేయాలనీ నిర్దేసిన్చినట్లు తెలిపారు. అదే విధంగా జిల్లాకు 16 బ్లాక్ స్థాయి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేసారని ఒక్కొక్కటి 80.96 లక్షలతో ఏర్పాటు చేస్తారని, పట్టన ప్రాంతాలలో 25 వేలు పైబడి జనాభా ఉన్న ప్రాంతాలకు 48.85 లక్షలతో 37 అర్బన్ హెల్త్ సెంటర్ లను నిర్మిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులైన జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) వీరబ్రహ్మం, జాయింట్ కలెక్టర్ (ఆసరా) రాజశేఖర్, డి.పి.ఓ దసరధ రామి రెడ్డి, డి.ఎం అండ్ హెచ్ ఓ డా.శ్రీహరి, చిత్తూరు నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వనాద, పుంగనూరు మునిసిపల్ కమిషనర్ లోకేష్ వర్మ, ఎం.పి.డి.ఓ బి.కొత్తకోట, రామ కుప్పం, జి.డి.నెల్లూరు వైద్యాదికారులు పాల్గొన్నారు.

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: 43.56 crore 15th Finance Commission funds for medical development in the district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page