బోయకొండలో వేలం పాటల ద్వారా రూ:56.87 లక్షలు ఆదాయం

0 9,664

-రికార్డు స్థాయిలో ఆదాయం రావడం హర్షణీయం
– ఆలయ అభివృద్దిపనులను పరిశీలించిన పెద్దిరెడ్డి

 

చౌడేపల్లె ముచ్చట్లు:

- Advertisement -

పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయ అడ్మినిస్ట్రేటీవ్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వేలం పాటల ద్వారా రూ:56.87 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటి చైర్మన్‌ మిద్దింటి శంకర్‌ నారాయణ తెలిపారు. ఆలయ ఈఓ చంద్రమౌళిల ్యధ్వర్యంలో వేలం పాటలను నిర్వహించారు. ఆలయం వద్ద పెద్దభోగ ం, చిన్న బోగం ను నిర్వహించుకోవడానికి ఆరునెలల పాటు హక్కుపై జరిగిన వేలంలో నవీన్‌కుమార్‌ రూ:36,83,000 అధికంగా హెచ్చు పాట పాడి సొంతం చేసుకొన్నారు. అలాగే బోయకొండపైకి టోల్‌గేట్‌ వసూలు హక్కుపై గిరిబాబు రూ:20,04,000 హెచ్చుపాట పాడి సొంతం చేసుకొన్నారు. ఈ రెండు వేలాలు ఆలయం వద్ద తొలిసారిగా నిర్వహించి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూర్చారు. ఈ కార్యక్రమంలో పాలక మండళి సభ్యులు వెంకటరమణారెడ్డి, శ్రావణి, ఈశ్వరమ్మలతోపాటు మాజీ సభ్యులు రాయల మోహన్‌, తదితరులున్నారు.

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: 56.87 lakh revenue through auction songs in Boyakonda

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page