బోయకొండలో అభివృద్ది పనులు వేగవంతం చేయండి

0 9,267

-వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి
– అభివృద్దిపనులు పరిశీలన

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

పుణ్యక్షేత్రమైన బోయకొండ లో అభివృద్దిపనులు వేగవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి సూచించారు. బుధవారం ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళితో కలిసి పనులను పరిశీలించారు. బోయకొండలో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్‌రెడ్డి చొరవతో మంజూరైన పనులను త్వరితగతిన పనులు పూర్తిచేయాలని సూచించారు. బోయకొండలో గెస్ట్ హౌస్‌ నిర్మాణం చేపట్టే స్థలాన్ని పరిశీలించారు. ప్లాన్‌ సిద్దం చేసిన తరువాత టెండర్‌ పిలిచి పనులు త్వరగా వెహోదలైయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే భక్తులు తీసుకొచ్చే వాహనాలకోసం కేటాయించిన పార్కింగ్‌ స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు మార్గంతోపాటు వాహనాల భద్రత కోసం ప్రహరీ తోపాటు మౌళిక సదుపాయాల కల్పన కు చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి చొరవతో బోయకొండ ఆలయం వద్ద ఆహ్ల్రాదకరమైన వాతావరణంను తలపించేలా పార్క్, మౌళికవసతుల కల్పన పనులు చురుగ్గా జరుగుతున్నాయని, త్వరగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. వారి వెంట సింగిల్‌విండో వైస్‌ చైర్మన్‌ రమేష్‌రెడ్డి, సోమల మల్లికార్జునరెడ్డి, సదుం ఇమ్రాన్‌, లడ్డూరమణ, పిఆర్‌ డిఈఈ మురళీధర్‌, ఏఈ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: Accelerate development works in Boyakonda

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page