భరద్వాజ తీర్థం (లోబావి) నందు  మృతదేహం ఖననం

0 9,285

చిత్తూరు ముచ్చట్లు

 

శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి  కూత వేటు దూరంలో ఉన్న  భరద్వాజ తీర్థం (లోబావి) లో   వెలసిన భరద్వాజేశ్వరాలయం వద్ద వ్యక్తిని ఖననం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన లోకేష్ అనే వ్యక్తి (34) మృతదేహాన్ని సోమవారం  ఇక్కడకు తీసుకువచ్చి ఆలయం పక్కన ఖననం చేశారు. ఆ వ్యక్తి ఎవరు..? నాయుడుపేట నుంచి ఇక్కడకు తీసుకురావాల్సిన అవసరం ఏముంది..? అయినా భరద్వాజేశ్వరాలయం పక్కన సమాధి చేయడం ఎంత వరకు సమంజసం..? స్థానికేతర వ్యక్తికి ఎవరు అనుమతి ఇచ్చారనేది సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. భరద్వాజ మహర్షి తపస్సు చేసిన దివ్య ప్రదేశంగా ఇక్కడి ప్రాంతం పవిత్రతను సంతరించుకుంది. ఏళ్ల క్రితం ఇక్కడే ఉంటూ భగవంతుని సేవించుకుంటూ అవధూతలుగా ఉంటున్న భక్తులను ఇక్కడ సమాధి చేశారు. అది జరిగింది కూడా ఏళ్ల క్రితం. అయితే ప్రస్తుతం బయటి వ్యక్తుల మృతదేహాలను ఇక్కడ ఖననం చేసేందుకు వీలు కాదు. ఎక్కడో నాయుడుపేటకు చెందిన వ్యక్తి గతంలో ఇక్కడ అవధూతగా ఉంటూ వచ్చిన కోట్లమ్మ శిష్యుడని చెప్పి ఇక్కడకు తీసుకువచ్చి ఖననం చేయడం విమర్శలకు కారణం అవుతోంది. దీనిపై విచారణ జరిపి ఏమి తెలుపుతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: Burial at Bhardwaj Tirtha (Lobavi)

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page