అనితఆశయాన్నిగెలిపించినసీఎంస్టాలిన్.

0 9,010

తమిళనాడు ముచ్చట్లు:

 

ఈ పాప పేరు అనిత. ఐదేళ్ళక్రితం తమిళనాడులో NEET ద్వారా డాక్టర్ కావాలని కలలుకన్న నిరుపేద దళిత బిడ్డ. ఊళ్లోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన తాను పన్నెండోతరగతిలో 1200 కి 1176 మార్కులు తెచ్చుకున్నా NEET లో మాత్రం అడ్మిషన్ కి కావాల్సిన 40% బదులు 13% మాత్రమే సంపాదించడంతో అడ్మిషన్ దొరకలేదు. నిరాశకు గురైన అనిత కోర్టుని ఆశ్రయించింది, తన పన్నెండో తరగతి మార్కులను consider చేసి తనకు మెడిసిన్ సీటు ఇవ్వాలనీ, డాక్టర్ కావలనేది తన కల అనీ ఎంతో పోరాడింది. తనకు పెద్ద ఎత్తున సపోర్ట్ లభించింది. కానీ తన కల నెరవేరలేదు, తీవ్ర నిరాశచెందిన అనిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

 

 

- Advertisement -

కానీ తన పోరాటానికి ఫలితం ఈరోజు దక్కింది.
తమిళనాడు సేలంకు చెందిన మరో యువతి NEET పరీక్షలో గెలవలేనననుకొని మొన్నటిరోజు ఆత్మహత్యకు పాల్పడింది. ఈవార్త తెలుసుకున్న సీఎమ్ స్టాలిన్ గారు NEET అవసరంలేకుండా, పన్నెండో తరగతి మార్కుల మెరిట్ తోనే మెడిసిన్ కి qualify అయ్యేలా బిల్లు తెచ్చారు. ఇది వెంటనే అమల్లోకి రానుంది.

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: C.Emstalin

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page