పుంగనూరులో అభివృద్ధి పరుగులు -వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి

0 9,021

పుంగనూరు ముచ్చట్లు:

 

నియోజకవర్గంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ కెఎల్‌.వర్మ, ఎంవిఐ మనోహర్‌రెడ్డి, తహశీల్ధార్‌ వెంకట్రాయులు, చైర్మన్‌ అలీమ్‌బాషాతో క లసి ఆర్టీఏ ఆఫీసుకు అవసరమైన భవనాలను పరిశీలించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ ముప్పె ఏళ్ళుగా ఎదురుచూస్తూన్న ఆర్టీఏ యూనిట్‌ ఆఫీస్‌ పుంగనూరులో త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే ఎన్నికల హామి మేరకు ఆర్టీసి డిపో, సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు, బైపాస్‌రోడ్డు, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల, ఉర్ధూకళాశాలలు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. మంత్రి నియోజకవర్గ అభివృద్ధి కోసం పంపుతున్న ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించి, నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరు వైఎస్‌ఆర్‌సిపి నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన పేదలందరిని పథకాలు అందించాలన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ అంజిబాబు, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌, కౌన్సిలర్లు నరసింహులు, తుంగా మంజునాథ్‌, ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: Development runs in Punganur – YSRCP Secretary of State Peddireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page