చౌడేపల్లిలో విద్యార్థులకు జగనన్న విద్య కానుక పంపిణీ

0 9,647

చౌడేపల్లి ముచ్చట్లు:

 

చౌడేపల్లి మండలం పరికిదోన పంచాయతీ మల్లెల వారి పల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు లక్ష్మీపతి ,నూర్ సాద్ టీచర్ చైర్మన్ ఆధ్వర్యంలో  జగనన్న విద్యా కానుక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ లక్ష్మీదేవి బాబు , వార్డు నెంబర్ రామకృష్ణ హాజరయ్యారు .ఈ సందర్భంగా బాబు  మాట్లాడుతు పంచాయతీరాజ్ శాఖ మంత్రి  డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాల తో పంచాయతీలోని పాఠశాలల రూపురేఖలను మారుస్తామని అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంతో పంచాయతీలోని పిల్లల హాజరు సంఖ్య పెరిగిందని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉందని బాధ్యతగా వ్యవహరించాలని పాఠశాల పైపిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సహాయసహకారాలు అందించాలని కోరుకుంటున్నానన్నారు. పిల్లల తల్లిదండ్రులు వాలంటీర్లు కిరణ్ వెంకటేష్ చిన్న కంపల్లి వాలంటీర్ గంగ భవాని పాల్గొన్నారు .చివరగా పాఠశాల ఆవరణంలో ఏపుగా పెరిగిన చెట్టుకొమ్మలు విరిగిపడి పిల్లలకు గాయాలు అవుతున్నాయని పిల్లల తల్లిదండ్రులు వాటిని తొలగించాలని వినతిపత్రంఅందజశారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

 

Tags; Distribution of Jagannath education gift to students in Choudepally

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page