19న ఉచిత మోడల్ లాసెట్ పరీక్ష

0 7,750

నెల్లూరు  ముచ్చట్లు:

ఈనెల 19న స్థానిక పొదలకూరు రోడ్డు లేక్ వ్యూ కాలనీ 3వ వీధి లో ఉన్న లిటిల్ బర్డ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉచిత మోడల్ లాసెట్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ అడ్వకేట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ఎన్. నాగరాజ్ యాదవ్ పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ నందు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లా సెట్ వ్రాయబోతున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత మోడల్ లాసెట్ పరీక్ష నిర్వహించబడుతుం ధన్నారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షలో జిల్లా ప్రాంతాలకు విభేదాలు లేకుండా ఎక్కడివారైనా పాల్గొనవచ్చని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ అడ్వకేట్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకొని ప్రకటించారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా శెట్టిపల్లి శ్రీదేవి, ఉపాధ్యక్షులుగా షేక్ బాబా, సంయుక్త కార్యదర్శులుగా షేక్ షఫీ మరియు సిహెచ్ శ్రీధర్ లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ అడ్వకేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పి వి ప్రసాద్ రావు, ఉపాధ్యక్షులు నక్కా సీనయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags:Free Model Lacet Test on 19th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page