ఘనంగా పోలీస్ అమర వీరుల దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్-డే కార్యక్రమాలు-డీజీపీ మహేందర్ రెడ్డి

0 8,486

హైదరాబాద్   ముచ్చట్లు:

అక్టోబర్ 21 తేదీన న నిర్వహించే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు, 21 వ తేదీ నుండి అక్టోబర్ 31 వ తేదీ వరకు పోలీస్ ఫ్లాగ్ డే పేరుతొ సంస్మరణ దినోత్సవాలను నిర్వహిస్తున్నట్టు డీ.జీ.పీ. ఎం.మహేందర్ రెడ్డి తెలియచేసారు. నేడు డీ.జీ.పీ కార్యాలయంలో పోలీసు అమర వీరుల దినోత్సవాల ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు డీ.జీ.పీ లు గోవింద్ సింగ్,రాజీవ్ రతన్, జితేందర్, శివధర్ రెడ్డి, అనీల్ కుమార్, స్వాతి లక్రా, ఐజీలు ప్రభాకర్ రావు, సైబరాబాద్  సి.పీ స్టీఫెన్ రవీంద్ర తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా డీ.జీ.పీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, పూర్తిగా కోవిద్ నిబంధనలను పాటిస్తూ నిర్వహించే ఈ పోలీసు అమరవీరుల దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలలో పౌరులు పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. అక్టోబర్ 21 వ తేదీ నుండి అక్టోబర్ 31 వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాలను పోలీస్ ఫ్లాగ్- డే  గా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని వెల్లడించారు.అక్టోబర్ 21 తేదీనుండి 31 వతేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రతి జోన్ లో ఒక పోలీస్ స్టేషన్ లో ప్రత్యేకంగా ఓపెన్ హౌస్ నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆన్లైన్ పద్దతిలో వ్యాసరచన పోటీలు నిర్వహణ, భారత స్వతంత్ర పోరాట స్ఫూర్తిని కలుగ చేసే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పోలీసింగ్ అంశంపై ఫోటోగ్రఫీ కాంపిటీషన్, స్వల్ప నిడివి గల వీడియో కాంపిటీషన్  లను  నిర్వహిస్తామనితెలిపారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags:Ghananga Police Martyrs’ Day, Police Flag-Day Programs-DGP Mahender Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page