గోవాలో ప్రారంభ‌మైన  విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి జ‌గ‌న్నాధ్‌, క‌ర‌ణ్ జోహార్‌, ఛార్మీ కౌర్ పాన్ ఇండియా ఫిలిం `లైగ‌ర్` (సాలా  క్రాస్  బ్రీడ్‌) కొత్త షెడ్యూల్.

0 8,433

సినిమాముచ్చట్లు:

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ, డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్, నిర్మాతలు కరణ్‌జోహార్, చార్మీల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘లైగర్’. విజయ్ దేవరకొండ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ‘సాలా క్రాస్‌బీడ్‌’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ రోజు (బుధవారం) గోవాలో  లైగర్‌ నెక్ట్స్‌ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేశారు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ షెడ్యూల్ లో చిత్రంలోని మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ సీన్స్ ను షూట్ చేయనున్నారు.
బ్లడ్..స్వెట్… వైలెన్స్ #లైగ‌ర్ షూటింగ్ తిరిగి ప్రారంభం అని విజ‌య్ దేవ‌ర‌కొండ ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా లైగర్ షూటింగ్ లొకేష‌న్ నుండి కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు నిర్మాత‌ ఛార్మి. ఈ పోస్టర్ లో కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్న విజయ్ దేవరకొండ MMA ఫైటర్‌గా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఈ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ లో ఫారెన్ ఫైటర్స్ కూడా భాగం కాబోతున్నారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ థిల్లర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ పూర్తిగా న్యూ లుక్ లోకి మారారు. మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని సినిమా కోసం నాచురల్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ భారీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై భారీ రేంజ్ లో బడ్జెట్ లో ఎక్కడా కాంప్ర‌మైజ్‌ కాకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా…థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచా ఈ సినిమాకు వర్క్ చేస్తుండటం విశేషం. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్‌జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషలలో రూపొందుతున్న ఈ సినిమాలో రమ్య కృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
నటీనటులు విజయ్‌దేవరకొండ, అనన్యాపాండే, రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్‌ దేశ్‌ పాండే, గెటప్‌ శీను

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags:New schedule of Vijay Devarakonda, Puri Jagannadh, Karen Johar, Charmi Kaur Pan India film `Liger` (Sala Cross Breed) which started in Goa.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page