తెలుగు రాష్ట్రాల్లో ఆగని నేరాలు

0 8,752

విజయవాడ  ముచ్చట్లు:

లంగాణ రాష్ట్రంలో గతేడాది నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(NCRB) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం.. 2020 సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా 12 శాతం నేరాలు పెరిగాయి. రాష్ట్రంలో గతేడాది మహిళపై లైంగిక వేదింపులకు సంబంధించి 4,907 కేసులు నమోదు అయ్యాయి. ఇలా మహిళలపై లైంగిక దాడులు, హత్యలు, దోపిడీలు, వంటి కేసులు భారీగా నమోదు అయ్యాయి.ఆంధ్రప్రదేశ్‌లో నేరాల సంఖ్య పెరుగుతూ పోతోంది. ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడుతున్నామని చెబుతున్నప్పటికీ ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2019తో పోలిస్తే 2020లో నేరాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఏకంగా 63శాతం మేర పెరిగాయంటే మామూలు విషయం కాదు. జాతీయ స్థాయిలోనూ పెరిగాయి.అయితే ఆ సగటు 23 శాతం మాత్రమే ఉంది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో ఈ నివేదిక వెలుగులోకి రావడం చర్చనీయాంశం అవుతోంది.2019లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1 లక్షా 45, 751 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఐపీసీతో పాటు స్థానిక చట్టాల కింద నమోదైన కేసులు ఉన్నాయి. అదే 2020లో ఈ కేసుల సంఖ్య 2 లక్షల 38వేల 105కి చేరింది. అంటే దాదాపుగా ఒక్క ఏడాదిలోనే లక్ష కేసులు అదనంగా నమోదయ్యాయి. స్థానిక చట్టాలపై నమోదైన కేసులను తీసేసి.. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులను చూసినా 58 శాతానికిపైగా కేసుల నమోదు ఉంది. ఇది దేశంలో అత్యధిక వృద్ధి. దేశంలో అత్యధిక నేరాలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో 2019లో ఏపీ 12వ స్థానంలో ఉండేది. ఈ ఏడాది మూడు స్థానాలు పెరిగి 9వ స్థానానికి వచ్చింది. దేశంలో అతి పెద్ద రాష్ట్రాల్లో జరగనన్ని నేరాలు , ఘోరాలు ఏపీలో జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించినట్లయింది.

- Advertisement -

ఏపీలో ఘోరం జరగని రోజంటూ ఉందా !? ఆంధ్రప్రదేశ్‌లో ఘోరం జరగనిరోజు ఉండటం లేదు. చిన్నపిల్లలు, మహిళలు, రాజకీయ దాడులు, రాజకీయ కేసులు ఇలా ఏదో ఒక అంశంతో అలజడి రేగుతూనే ఉంది. వందల కొద్దీ కేసులు పెడుతూనే ఉంది. సంచలనం సృష్టించిన ఘటనల్లో బాధితులకు ప్రజాధనాన్నే పరిహారంగా ఇస్తున్న ప్రభుత్వం నిందితులకు శిక్షలు విధించడంలో మాత్రం ఆసక్తి చూపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో నేరాలు చేయాలన్న వారికి ధీమా దొరుకుతోందని ఆ ప రిస్థితికి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలే కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం వల్ల నేరగాళ్ల గుప్పిట్లోకి ప్రజలు ! పోలీసులు పూర్తిగా రాజకీయ పరమైన విధి నిర్వహణకు అంకితమైపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ పరమైన కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడానికి తప్ప ఇక దేనికీ వారు పని చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తూ డీజీపీనే ప్రతిపక్షాలు అంటూ మాట్లాడటం వివాదాస్పదమయింది. కారణం ఏదైనా అటు పోలీసుల వైఫల్యమో.. ఇటు ప్రభుత్వ స్వార్థమో కానీ… ప్రజలు మాత్రం నేరగాళ్ల గుప్పిట్లో చిక్కుకున్నారని.. రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్ అయిందన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఈ నివేదిక ఉంది.
తెలంగాణలో నేరాల వివరాలు..
రాష్ట్రంలో 2020 సంవత్సరంలో 12 శాతం నేరాలు పెరిగాయి.
వాటిలో మహిళల పై లైంగిక వేధింపుల కేసులు – 4,907
చిన్నారులపై లైంగిక దాడులు, పొక్సో కేసులు – 2,074
మహిళలపై దాడుల కేసులు – 2,520
హైదరాబాద్ వ్యాప్తంగా రేప్ కేసులు – 92
తెలంగాణ వ్యాప్తంగా రేప్ కేసులు – 764
బహిరంగంగా మహిళలను వేధించిన కేసులు – 21
సైబర్ స్టాకింగ్ ద్వారా మహిళల్ని వేధించిన వారిపై కేసులు – 1,436
చిన్నారుల మిస్సింగ్ కేసులు – 420
మహిళలు వరకట్న వేదింపులు తాలలేక ఆత్మహత్యకు పాల్పడిన కేసులు – 158
తెలంగాణ వ్యాప్తంగా హత్య కేసులు – 802
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు – 117
నిర్లక్ష్యం కారణంగా మరణించిన కేసులు – 7,564
రోడ్డు ప్రమాదాల్లో మరణించిన కేసులు – 7,226
హిట్ అండ్ రన్ కేసులలో మరణించిన వారు – 1,365
మహిళలపై యాసిడ్ దాడి కేసులు – 5
ముఖ్య గమనిక: ఈ కేసులన్నీ ఒక్క 2020 సంవత్సరంలో నమోదైనవి మాత్రమే.

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags:Non-stop crimes in Telugu states

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page