నిర్ణీత వ్యవధిలోగా పిటిషన్ లను పరిష్కరించాలి

0 8,426

పెండ్లిమర్రి మండలంలోని ఇసుక పల్లి గ్రామ సచివాలయం సందర్శించి మహిళా పోలీసులతో ముఖాముఖి మాట్లాడిన  జిల్లా ఎస్.పి

కడప   ముచ్చట్లు:

- Advertisement -

జిల్లాలో విధులు నిర్వర్తించే మహిళా పోలీసులు, మహిళా మిత్రలు మహిళల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో పరిష్కరించేలా కృషి చేయాలని జిల్లా ఎస్.పి  కే.కే.ఎన్ అన్బురాజన్  ఆదేశించారు. బుధవారం జిల్లాలోని     పెండ్లిమర్రి మండలం లోని ఇసుకపల్లి గ్రామ సచివాలయాన్ని ఎస్.పి  సందర్శించి మహిళా పోలీసులతో, మహిళా మిత్రలతో ముఖాముఖి మాట్లాడారు. రికార్డులను పరిశీలించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి  మాట్లాడుతూ మహిళా సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ముందుగా మీరు విధులు నిర్వర్తించే పరిధిలో మహిళల సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, ఆత్మీయంగా పలకరిస్తూ సమాచారం తెలుసుకోవాలన్నారు. పోలీసు శాఖ మహిళలకు అండగా ఉందనే భరోసా కల్పించాలని ఆదేశించారు.  మహిళలు సంచరించే చీకటి ప్రాంతాలలో సమస్యలుండే ప్రదేశాలను గుర్తించి బీట్లను పెంచి గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా వచ్చే ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను సచివాలయంలో స్వీకరించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాను వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. ఫిర్యాదుదారులు వ్యయప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ఇది ఉపయోగపడుతుందని ఎస్.పి తెలిపారు. ఫిర్యాదుదారులు ఆయా గ్రామ, వార్డు సచివాలయంలో ఉండే మహిళా పోలీసులకు ఫిర్యాదు ఇస్తే తాను ముఖాముఖి మాట్లాడతానన్నారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి ‘దిశ’ యాప్ పై మహిళా మిత్రలకు అవగాహన కల్పించి యాప్ ను ఎలా వినియోగించాలో వివరించారు.
ఈ  కార్యక్రమంలో పెండ్లిమర్రి ఎస్.ఐ కొండారెడ్డి, మహిళా పోలీసులు, మహిళా మిత్రలు పాల్గొన్నారు.

 

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags:Petitions should be resolved within the stipulated time

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page