టీటీడీ బోర్డు మెంబరుగా పోకల అశోక్‌కుమార్‌

0 9,759

అమరావతి ముచ్చట్లు:

 

ప్రపంచ ప్రసిద్దిగాంచిన తిరుమల-తిరుపతి దేవస్థానం బోర్డు మెంబరుగా కాపు సంఘ రాష్ట్ర నాయకుడు పోకల అశోక్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితుడైన పోకల అశోక్‌కుమార్‌ను నియమించాల్సిందిగా మంత్రి పెద్దిరెడ్డి , సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు సీఎం ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా పోకల అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డిల సహకారంతో తనకు ఈ పదవి లభించిందని తెలిపారు. శ్రీవారి సేవలను భక్తులకు అందించేందుకు కృషి చేస్తామన్నారు. తనకు మ హూ న్నతమైన పదవి ఇచ్చిన ముఖ్యమంత్రికి, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

 

Tags: Pokala Ashok Kumar as TTD board member

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page