పుంగనూరు పాఠశాలల్లో నాణ్యమైన భోజనం – చైర్మన్‌ అలీమ్‌బాషా

0 9,674

పుంగనూరు ముచ్చట్లు:

 

వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించడం జరుగుతోందని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. బుధవారం ఆయన పట్టణంలోని పలు పాఠశాలల్లో జగనన్న విద్యాకానుక పంపిణీ చేసి, భోజన కార్యక్రమాన్ని పరిశీలించి, యూపి హైస్కూల్‌లో విద్యార్థులతో కలసి భోజనం చేశారు. చైర్మన్‌ మాట్లాడుతూ నాడు-నేడు పథకంతో పాఠశాలల రూపురేఖలు మారిందన్నారు. అలాగే పాఠశాలల విద్యార్థులకు మెను ఏర్పాటు చేసి, భోజనం పంపిణీ చేయడం హర్షనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం లభించి, అడ్మీషన్లకు డిమాండ్‌ ఏర్పడిందన్నారు. కార్పోరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, కౌన్సిలర్‌ భారతి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags; Quality Meals in Punganur Schools – Chairman Aleem Basha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page