సైదాబాద్ హత్యాచార ఘటన.. నిందితుడు రాజు అరెస్ట్

0 9,800

సైదాబాద్ ముచ్చట్లు:

 

సంచలనంగా మారిన ఆరేళ్ల చిన్నారి హత్యచార ఘటనలో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో గురువారం సాయంత్రం చిన్నారిపై అఘాయిత్యాకి పాల్పడి, దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజు అనే వ్యక్తిని యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో అరెస్టు చేశారు. అతడిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించినట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్‌ వెల్లడించారు.బాలిక పక్కింట్లో నివసించే నిందితుడి ఇంట్లోనే బాలిక మృతదేహం లభ్యం కావడంతో అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్‌ ఆధ్వర్యంలో పది ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం గాలించి.. చివరకు అతడి స్వగ్రామం అడ్డగూడూరులో అరెస్ట్ చేశారు.సైదాబాద్ పరిధి సింగరేణి కాలనీలో చిన్నారిపై రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బృందాలుగా విడిపోయి రాజు కోసం గాలిస్తున్నారు.

 

 

- Advertisement -

తాజాగా పోలీసులు కీలక ప్రకటన చేశారు. రాజును పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మరోవైపు రాజును ఎన్‌కౌంటర్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మంత్రి మల్లారెడ్డి కూడా రాజును ఎన్ కౌంటర్ చేస్తామని తెలిపారు. కాగా ఘటన జరిగిన రోజు సాయంత్రం ఎల్బీనగర్ వద్ద మరో స్నేహితుడితో కలిసి రాజు మద్యం తాగాడు. ఆ తర్వాత బయటకు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు ఎల్బీనగర్ వద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే రాజు స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు రాజు చేసిన నేరం తెలియదన్నాడు. మద్యం తాగిన తర్వాత రాజు ఎటు వెళ్లాడో తనకు తెలియదని చెప్పాడు. గతంలో నిందితుడు రాజుపై బైక్ దొంగతనం కేసు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి ప్రవర్తన నచ్చక భార్య వదిలేసి వెళ్లిపోయిందని పోలీసుల విచారణలో తేలింది. ఎట్టకేలకు ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్‌ ఆధ్వర్యంలో పది ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం గాలించి.. చివరకు అతడి స్వగ్రామం అడ్డగూడూరులో అరెస్ట్ చేశారు.

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags; Saidabad murder case .. Accused Raju arrested

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page