నేరాల లిస్ట్ లో తెలంగాణకు మొదటి స్థానం-రేవంత్ రెడ్డి

0 8,458

హైదరాబాద్  ముచ్చట్లు:

సీఎం కేసీఆర్ పాలన పగ్గాలు చేపట్టి ఏడున్నర ఏళ్లు అవుతోంది. కేసీఆర్ అవినీతి మీద ఆధారాలతో సహా కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన కేంద్రం స్పందించడం లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. . కేసీఆర్ కుటుంబం భారీ గా ఆస్తులు కూడబెట్టిందని బీజేపీ నేతలు బండి సంజయ్ మాట్లాడుతున్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ కు అమిత్ షా వస్తున్నారు.  ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు , ఒక ఎమ్మెల్సీ లకు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇస్తే కేసీఆర్ అవినీతి పై ఆధారాలు అందచేస్తాం. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, మైనింగ్ ఇలా అనేక అవకతవకలపై ఫిర్యాదు చేస్తాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధారాలు లేవంటున్నారు.. మాకు అపాయింట్ మెంట్ ఇప్పిస్తే మేము అందజేస్తాం. తెలంగాణ లో వ్యసనపరులకు స్వర్గదామంగా మారింది. విపరీతంగా మధ్యం అమ్మకాలు సాగుతున్నాయి.  బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రాన్ని తాగుబోతులుగా మారుస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పాశవిక దాడులకు.. మద్యం మత్తులో చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో లో  నేరాల లిస్ట్ లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. మద్యం , గంజాయి మత్తులో తెలంగాణ యువత చిక్కుకుంటోంది. హైదరాబాద్ సింగరేణి ఘటనపై .. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ నిందితుడు పట్టుబడ్డాడని చెప్పారు. 5 రోజుల తర్వాత నిందితుడు దొరకలేదని పోలీసులు బహిరంగ ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఉందా.. సీఎం కేసీఆర్ ను అడుగుతున్నానని అన్నారు. ఆరేళ్ల పసిబాలలను చెరిపి చెంపేసే విష సంస్కృతి ని విశ్వనగరంలో ప్రొత్సహిస్తున్నది ఎవరు.? సినీనటులు డ్రగ్స్ వాడుతున్నారని గతంలో ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసి.. విచారణ అధికారి అకున్ సభర్వాల్ ను పక్కకు తప్పించారు. డ్రగ్స్ కేసులో నేను కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో కేసు వేశాను. ఈడీ విచారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కోర్టు లో పేర్కొంది. డ్రగ్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదు. బెంగళూరు, ఢిల్లీ, మహారాష్ట్ర లో తీగ లాగితే హైదరాబాద్ లింక్ లు బయటపడుతున్నాయి.  హైదరాబాద్ లో సింగరేణి కాలనీ.. హోంమంత్రి మహమూద్ అలీ ఇంటికి కూతవేటు దూరంలో ఉంది. సింగరేణి లో గంజాయి, గుడుంబా విచ్చలవిడిగా సాగుతున్న పోలీసులు ఏం చేస్తున్నారు. సింగరేణి కాలనీ ని దత్తత తీసుకున్న కేటీఆర్ కు.. ఘోర ఘటన జరిగిన ఎందుకు పట్టించుకోవడం లేదు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే సీఎం ఎందుకు సమీక్ష చేయడం లేదని ప్రశ్నించారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags:Telangana ranks first in crime list – Rewanth Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page