జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మొద‌టి ర్యాంకులో నిలిచిన తెలంగాణ విద్యార్థులు

0 5,686

హైద‌రాబాద్ ముచ్చట్లు:

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మెరిశారు. 100 ప‌ర్సంటైల్ సాధించి మొద‌టి ర్యాంకు పొందిన 18 మందిలో తెలంగాణకు చెందిన ఇద్ద‌రు విద్యార్థులు ఉన్నారు. కొమ్మ శ‌రణ్య‌, జోష్యుల వెంక‌ట ఆదిత్య 100 ప‌ర్సంటైల్ సాధించి మొద‌టి ర్యాంకులో నిలిచారు.జేఈఈ మెయిన్స్ నాలుగో విడత ఫలితాలను మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. ఇందులో దేశవ్యాప్తంగా 44మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించగా, వారిలో 18 మంది విద్యార్థులకు మొదటి ర్యాంకు వచ్చింది. వీరిలో తెలంగాణకు చెందిన ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు ఉండటం విశేషం. మొత్తం 9,34,602 మంది విద్యార్థులు మెయిన్స్‌ పరీక్ష రాశారు.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుగ్గినేని వెంక‌ట‌ ప‌నీష్‌, ప‌స‌ల వీర‌శివ‌, కుంచ‌న‌ప‌ల్లి రాహుల్ నాయుడు, కరణం లోకేష్ మొదటి ర్యాంక్‌ సాధించిన వారిలో ఉన్నారు. జేఈఈ మెయిన్ నాలుగో విడుత పరీక్షను ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 334 కేంద్రాల్లో 13 భాషల్లో (తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, గుజరాతి, అస్సామీస్‌, బెంగాలి, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిశా, పంజాబీ, తమిళం) నిర్వహించారు.ఈ పరీక్ష ద్వారా ఎన్‌ఐటీ, ఐఐఐటీలతోపాటు కేంద్ర నిధులతో నడుస్తున్న సాంకేతిక విద్యా సంస్థల్లో బీఈ, బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags:Telangana students ranked first in JEE Mains results

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page