చిన్నారి పై దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి

0 562

నరసాపురం ముచ్చట్లు:

హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల చిన్నారి పై దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఇటువంటి సంఘటనలు మరల జరగకుండా మహిళా చట్టాల ను కఠినంగా అమలు చేయాలని కోరుతూ ఎస్ ఎఫ్ ఐ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణం కమిటీ  ఆధ్వర్యంలో మున్సిపల్ హై స్కూల్ నుండి గాంధీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భం గా ఎస్ఎఫ్ఐ నాయకులు కిషోర్ మాట్లాడుతూ సమాజంలో ఇటువంటి  సంఘ టనలు ప్రతిరోజు ఏదో ఒక దిక్కున జరుగుతూనే ఉంటున్నాయి ఇటువంటి సంఘటనలు మరలా జరగకూడదు అంటే నిందితులను కఠినంగా శిక్షించి మహిళలలో ధైర్యాన్ని నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్ ఎఫ్ ఐ స్త్రీల పట్ల సోదర భావంతో వాళ్ల ను అన్ని విధాలుగా గౌరవిస్తామని వాళ్ల సమస్యల పట్ల ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  నర్సాపురం పట్టణ కార్యదర్శి వెంకట్, సభ్యులు పవన్ ఆదిత్య  పాఠశాల  విద్యార్థులు పాల్గొన్నారు .

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags:The perpetrators of the attack on the child should be severely punished

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page