నేడు అపోలో సెంటర్ నుండి నేను నా కార్యకర్త పాదయాత్ర ప్రారంభం.

0 8,583

-విజయవంతం కావాలని బారా షాహీద్ దర్గా లో పూజలు
-101 టెంకాయలు కొట్టిన రూరల్ వైకాపా నాయకులు

నెల్లూరుముచ్చట్లు:

- Advertisement -

కార్యకర్తల శ్రేయస్సుకోసం  గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురువారం  స్థానిక అపోలో హాస్పిటల్స్ సెంటర్ నుండి ప్రారంభించనున్న నేను నా కార్యకర్త కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లోను కాకుండా, విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ,గ్రామీణ వైకాపా నాయకులు బారా షహీద్ దర్గా లో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని ప్రతి కార్యకర్త కుటుంబంలోని ఆర్ధిక స్థితి గతులు, కుటుంబ బాగోగులు స్వయంగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి నేను నా కార్యకర్త పాదయాత్ర కార్యక్రమం ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా దర్గా ప్రాంగణంలో101 వంకాయలను కొట్టి, ఎమ్మెల్యే కోటంరెడ్డి కి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి తుది శ్వాస వరకు గ్రామీణ నియోజక వర్గ శాసనసభ్యులుగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షేక్ నాయబ్ రసూల్, మోహన్ రావు, ఖాదర్ మస్తాన్, హయాత్ భాష నెల్లూరు గ్రామీణ నియోజవర్గ వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags:Today I start my activist hike from the Apollo Center.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page