వాస్తవాలు తెలుసుకొని స్పందించాలి…

0 9,258

-కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా

కోరుట్ల  ముచ్చట్లు:

 

- Advertisement -

హైదరాబాద్ లోని సైదాబాద్ లో సంచలనం సృష్టించిన ఆరేళ్ల బాలిక హత్యోదంతం కేసులో నిందితుడిని కొన్ని గంటల్లోపే పట్టుకున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మెట్ పల్లి పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా అన్నారు. బుధవారం మెట్ పెల్లి పట్టణంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ మంత్రి హోదాలో ఉండి కేటీఆర్ నిందితున్ని సకాలంలో పట్టుకోవాలని చెప్పాల్సింది పోయి నిందితున్ని పోలీసులు పట్టుకోక ముందే వారిని ప్రశంసిస్తూ ప్రకటన చేయడం సరికాదన్నారు. ఇలా తెలిసీ తెలియని సమాచారాన్ని ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టే ప్రయత్నం మానుకోవాలన్నారు. కేసు వ్యవహారంలో ప్రకటన చేసే ముందు మంత్రి కేటీఆర్ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేగాని ఇలా తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్నారు. ఇప్పటికైనా సాధ్యమైనంత త్వరగా నిందితున్ని పట్టుకొని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో  జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి పోతుగంటి శంకర్ ,జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్, కోరుట్ల మాజీ పట్టణ అధ్యక్షులు అక్బర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్ రాజన్, లవంగ నరసయ్య, మహమ్మద్ కరీం తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: Tributes to Chaitra

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page