పైసా ఖర్చు లేకుండా పేదలను ఇండ్లలోకి పంపించాము

0 9,686

కరీంనగర్ ముచ్చట్లు:

 

జమ్మికుంట పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ ఆవరణలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమ జరిగింది. ఈ కార్యక్రమానికి  మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మాజీమంత్రి పెద్దిరెడ్డి, కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు తదితరులు హజరయ్యారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ జమ్మికుంట అక్కాచెల్లెళ్ళందరికి.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మిగతా గ్రూపులకు రూ. కోటి 50 లక్షలను కూడా బతుకమ్మ పండుగ లోపు అందజేస్తాం. ఏడేళ్లలో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. పేదింటి ఆడపిల్ల పెళ్లి కోసం కళ్యాణలక్ష్మీ పధకం ప్రవేశపెట్టామ్. రూ. 50 వేలతో కళ్యాణ లక్ష్మీ పథకం ఎస్సిలతో ప్రారంభించి.. ఇవాళ అన్ని వర్గాల పేదలకు రూ. లక్షా 116 ఇస్తున్నాం. ఆసరా పెన్షన్ 200 ఉండేది.. ఇచ్చిన మాట ప్రకారం 2016 పెన్షన్ ఇస్తున్నాం. రాబోయే కొద్ది రోజుల్లో 57 ఏళ్ళు నిండిన 4 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వనున్నం. వృద్ధులకు భరోసా దొరికింది.. కొడలుకు అత్తే ఆసరా అయింది. వృద్ధులు, వితంతువుల ఆత్మగౌరవం పెరిగింది.. వాళ్ళను ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుంటోంది. 2 ఏళ్లలో ఇంటింటికి నల్లా పెట్టి మన అక్కాచెల్లెళ్ల బాధ తీర్చినని అన్నారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే స్థాయి నుంచి ఇవాళ సర్కారు ఆస్పత్రులకే వస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు పెరిగాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేస్తున్నాం. కాంగ్రెస్, టీడీపీ ఎలాంటి సాయం చేయలేదు. దేశంలో ఇలాంటి పథకాలను ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోందా. జమ్మికుంటలో మహిళల కోసం కుటీర పరిశ్రమలు ప్రారంభించుకుందాం.. దానికోసం ప్రత్యేక కార్యాచరణ తీసుకొస్తామని అన్నారు.

 

 

- Advertisement -

ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చిందో ఆలోచించాలి. సిలిండర్ ధర రూ. 1000 పెరిగింది.. పెట్రోల్, డీజిల్, వంట నూనె ధర పెంచుతుంది. ధరలను పెంచుతుంది ఎవరు.. పేద ప్రజలను ఆదుకుంటోంది ఎవరు ఆలోచించాలి. మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కపాడుకుంటోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. మాయ మాటలకు మోసపోవద్దు. తెలంగాణలో ప్రతి మంత్రికి సీఎం కేసీఆర్ 4 వేల ఇండ్లు ఇచ్చారు. పైసా ఖర్చు లేకుండా పేదలను ఇండ్లలోకి పంపించాము. హుజురాబాద్ నియోజకవర్గానికి 5 వేల ఇండ్లు ఇస్తే.. 5 ఇండ్లు అయినా కట్టరా. పెండింగ్ లో ఉన్న ఇండ్లను పూర్తి చేస్తాం. జాగా ఉన్న వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి ఇస్తాం. పేదలకు పంచింది ఎవరు.. పేదలపై భారం వేసింది ఎవరు ఆలోచించాలి. తెలంగాణ వచ్చాక లక్ష 30 వేల ఉద్యోగాలు ఇచ్చాము.. మరో 50-60 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ఉద్యోగాలు ఇస్తున్నది టీఆర్ఎస్.. ఉద్యోగాలు ఊడగొడుతున్నది బీజేపీ అని విమర్శించారు.

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags: We sent the poor into houses without spending a penny

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page