న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో మెఘా కృష్ణారెడ్డి భార్య

0 8,765

న్యూయార్క్ ముచ్చట్లు:

న్యూయార్క్‌లో జరిగిన మెట్‌గాలా వేడుకలో ఫ్యాషన్ హోయలు పోయిన సుధారెడ్డి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఫ్యాషన్ ప్రియుల్లో స్పెషల్ ఎట్రాక్షన్. అసలు ఈమె ఎవరు ? అనే దగ్గర నుంచి అన్నీ ఆసక్తికర విషయాలే. ఆమె లైఫ్ స్టైల్ గురించి తెలిస్తే మరింతగా ఆశ్చర్యపోతారు. బిలియనీర్ అయిన మేఘా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి. దానికి తగ్గట్లుగా ఆమె లైఫ్ స్టైల్ ఉంటుంది. మేఘా సుధారెడ్డి ఇప్పుడు అందరికీ ఫ్యాషన్ స్టైల్లో పరిచయమయ్యారు కానీ హైదరాబాద్ సోషల్ సర్కిల్‌లో ఆమె తెలియని వారు ఎవరూ ఉండరు. ఆమె మేఘా ఇంజినీరింగ్ , ట్రూజెట్ ఎయిర్ లైన్స్ డైరెక్టర్ కూడా. అంతే కాదు ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్‌లో ఎక్కువగా పాల్గొంటారు. పిల్లల ఆరోగ్యం కోసం ఏర్పాటుచేసే కార్యక్రమాల్లో పాల్గంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనా సదస్సులు నిర్వహిస్తూ ఉంటారు. హాలీవుడ్ యాక్టర్స్ ఇవా లాంగరియా, ఎలిజబెత్ హర్లీ వంటి వారితో కలిసి పని చేశారు. ఫ్రాన్స్ లో జరిగిన ఓ సేవా కార్యక్రమంలో మన రూపాయల్లో కోటిన్నర విలువైన యూరోలను విరాళంగా ప్రకటించేశారు. గ్లోబల్ ఈవెంట్లులో ఆమె విరాళాలను చాలా పెద్దమొత్తంలో ప్రకటిస్తూ ఉంచారు. మేఘా సుధారెడ్డికి ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. ఫ్యాషన్ షాపింగ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. హైదరాబాద్ వీధుల్లో అమ్మే వస్తువుల నుంచి హైక్లాస్ లగ్జరీ ఉత్పత్తుల వరకు అన్నీ సేకరిస్తారు. ఆమె నోట్లో ఎడమవైపు ఓ పన్ను స్థానంలో వజ్రంతో చేసిన పన్ను ఉంటుంది. తాను నవ్వినప్పుడల్లా ఆ వజ్రం మెరుపు కనిపిస్తుందని ఆమె ఫ్యాషన్ మేగజైన్లకు ఇచ్చిన ఇంటర్యూల్లో పలు మార్లు చెప్పారు. సుధారెడ్డి అంటే భర్త మేఘా కృష్ణారెడ్డికి అమితమైన ప్రేమ. దానికి సాక్ష్యం ఆమె 40వ పుట్టినరోజు వేడుకలను కనీవినీ ఎరుగని రీతిలో చేయడం. 2018లో హైటెక్స్ లో జరిగిన పుట్టినరోజు వేడుకలో అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాయి. ఆ వేడుకలోనే భార్యకు రోల్స్ రాయిస్ కారును బహుమతిగా అందించారు. ఆ పుట్టిన రోజు వేడుకలకు ఎంతో మంది టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటూ అంతర్జాతీయ స్థాయిలోని ఫ్యాషన్ ప్రముఖులు పాల్గొన్నారు. ఫ్యాషన్ ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టంతో ఆమె అప్పుడప్పుడు ఫ్యాషన్ షోలను కూడా నిర్వహిస్తుంటారు. ఆ షోల కోసం దుబాయ్, ఫ్రాన్స్, అమెరికాల నుంచి ప్రత్యేకంగా డిజైనర్లను తీసుకొస్తుంటారు. ఆ ఇష్టంతోనే మెట్ గాలాలోనూ పాలగొన్నారు. మెట్ గాలాలో ఓ టేబుల్ రిజర్వ్ చేసుకోవాలంటే రూ. రెండుకోట్లకుపైగా వెచ్చించాలి. ఆయినా అది ఆమెకు చిన్న విషయమే.

- Advertisement -

పుంగనూరులో బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Tags:Wife of Megha Krishnareddy at New York Fashion Week

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page